Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ' అరబిందో' !

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:30 PM GMT
కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న  అరబిందో !
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి కట్టడికోసం పలు కంపెనీలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సహా పలు వైరస్‌ల అంతానికి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనిలో అరబిందో ఫార్మా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ఫండింగ్‌కు తమ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ ఎంపిక అయినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ అనుబంధ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్‌ ద్వారా ప్రొఫెక్టస్‌ బయోసైన్సెస్‌ ఆర్ ‌అండ్ ‌డీ ఆస్తులను కొనుగోలు చేశామని, దాని ద్వారా వ్యాక్సిన్ల విభాగంలో బలం పెంచుకున్నామని వెల్లడించింది.

నిమోనియా బారిన పడకుండా ఇచ్చే న్యూమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను సైతం కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఉత్పాదన మార్కెట్‌ విలువ ప్రపంచవ్యాప్తంగా 6.2 బిలియన్‌ డాలర్లు. ఫేజ్‌–1, ఫేజ్‌–2 పూర్తి అయిందని, ఫేజ్‌–3 క్లినికల్‌ స్టడీ ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించనున్నట్టు అరబిందో వెల్లడించింది. అలాగే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బయో టెక్నాలజీ విభాగం చేత తమ టీకా షార్ట్‌ లిస్ట్ చేయబడిందని, తద్వారా అభివృద్ధికి నిధులు సమకూరుతాయని అరబిందో వెల్లడించింది. ఓరల్స్‌ తయారీకై చైనాలో, ఇంజెక్టేబుల్స్, ప్యాచెస్, టాపికల్స్, ఇన్‌ హేలర్స్‌ వంటి ఉత్పత్తుల తయారీకై భారత్‌ తో పాటు యూఎస్‌ లో కొత్తగా ప్లాంట్లను స్థాపిస్తోంది. నూతనంగా ఏర్పాటైన బయో సిమిలర్స్, వ్యాక్సిన్స్‌ తయారీ యూనిట్లు కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి.