Begin typing your search above and press return to search.
ఆసీస్ బాల్ టాంపరింగ్.. తెరమీదకు సంచలన నిజాలు..!
By: Tupaki Desk | 18 May 2021 4:30 AM GMTఆస్ట్రేలియా క్రికెటర్లను బాల్ టాంపరింగ్ వ్యవహారం ఇప్పటికీ వదలడం లేదు. గతంలో ఆస్ట్రేలియాలో బాల్ ట్యాంపరింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై ఏడాది పాటు వేటు పడింది. అప్పట్లో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. డేవిడ్ వార్నర్, స్మిత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంతో బాన్‌క్రాఫ్ట్ ప్రధాన సూత్రదారిగా తేలిన విషయం తెలిసిందే. ఇటీవల అతడు సంచలన విషయాలు వెల్లడించాడు. మరోవైపు ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ తాజాగా ఈ వివాదంపై స్పందించాడు.
’ బాల్ టాంపరింగ్ గురించి బాన్క్రాస్ట్, డేవిడ్ వార్నర్, స్మిత్ తో పాటు చాలా మందికి ముందే తెలుసు. ఇది అంత సీక్రెట్ గా జరిగిన వ్యవహారం ఏమీ కాదు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం, సాండ్ పేపర్ వాడిన విషయం ముందే చాలా మంది బౌలర్లకు తెలుసని బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంపై తాజాగా గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. బాల్ ట్యాంపరింగ్ చాలా మంది బౌలర్లకు ముందే తెలుసు. కానీ ఆ పేర్లను వెల్లడించే సమయం కోసం నేను వేచి చూస్తున్నా’ అంటూ గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. బాల్‌ట్యాంపరింగ్ వ్యవహారంలో డేవిడ్ వార్నర్, స్మిత్, బాన్‌క్రాప్ట్ పేర్లు మాత్రమే ముందు తెరమీదకు వచ్చాయి. వాళ్లు మాత్రమే దోషులుగా తేలారు.
కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ఇంకా చాలా మంది క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ కూడా స్పందించాడు. ’ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో జరిగిన విచారణ మొత్తం ఏకపక్షంగా సాగింది. వార్నర్, స్మిత్ మాత్రమే దోషులుగా తేలారు. కానీ విచారణ పారదర్శకంగా సాగిఉంటే ఇంకా చాలా మంది దోషులుగా తేలేవారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళితే కచ్చితంగా న్యాయం జరిగేది’ అంటూ పేర్కొన్నారు.ఓ వైపు గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యలు.. మరోవైపు జేమ్స్ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్ ను ఓ కుదుపు కుదుపేశాయి. ఇంకా ఎంత మంది పేర్లు తెరమీదకు వస్తాయోమోనని కొందరు క్రికెటర్లలో గుబులు ఏర్పడుతోంది.