Begin typing your search above and press return to search.
కోహ్లీ దూకుడుకు కళ్లెం పడిందా?
By: Tupaki Desk | 25 Feb 2017 10:34 AM GMTటీమిండియా జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత భారత క్రికెట్ యువ కెరటం విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటిదాకా కెప్టెన్‌గా అతడికి టెస్టుల్లో అపజయమన్నదే లేదు. ఫార్మాట్ ఏదైనా సత్తా చాటుతున్న కోహ్లీ నాయకత్వంలో ఇక టీమిండియాకు ఎదురే లేదన్న భావన వ్యక్తమైంది. టాస్ ఎటు పడ్డా... ఫస్ట్ బ్యాటింగ్ అయినా... ఫస్ట్ బౌలింగ్ అయినా కోహ్లీ సేన దూకుడునే ప్రదర్శించింది. అయితే కాసేపటి క్రితం ఆ విజయ పరంపరకు తెర పడిపోయినట్లైంది. కంగారూలుగా పేరుపడ్డ ఆస్ట్రేలియా జట్టుతో పుణేలో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ సేన పూర్తి స్థాయిలో చేతులెత్తేసింది. ఫలితంగా భారీ స్కోరు తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో 19 టెస్టుల్లో అపజయమన్నదే లేకుండా సత్తా చాటుతూ వస్తున్న కోహ్లీ సేనకు తొలి అపజయం నమోదైంది. అది కూడా 333 పరుగుల తేడాతో పరాజయం అంటే... గెలుపులో రికార్డులు సాధించిన కోహ్లీ... పరాజయాల్లోనే రికార్డులే నెలకొల్పేలా ఉన్నాడన్న వాదన వినిపిస్తోంది.
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్ ధాటికి టీమిండియా బ్యాట్స్ మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిపోయిన ఓకీఫ్... రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. దీంతో భారత బ్యాట్స్‌మన్ చేతులెత్తేయాల్సి వచ్చింది. ఇక స్కోరు వివరాల్లోకెళితే... ఆస్ట్రేలియా జట్టు తన తొలిల ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగించి 285 పరుగులు చేసింది. ఇక కోహ్లీ సేన బ్యాటింగ్ విషయానికి వస్తే... ఓకీఫ్ స్పిన్ మాయాజాలానికి తడబడ్డ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ సేన పరుగులేమీ రాబట్టలేకపోయింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ 107 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా 333 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించించి. ఇప్పటిదాకా అపజయమన్నదే లేకుండా దూసుకెళుతున్న కోహ్లీ సేనకు ఆస్ట్రేలియా జట్టు అడ్డుకట్ట వేసేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/