Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా క్రికెటర్ల నోటి దూల..! ఈ టూర్​లో కొనసాగిస్తారా?

By:  Tupaki Desk   |   24 Nov 2020 12:30 AM GMT
ఆస్ట్రేలియా క్రికెటర్ల నోటి దూల..! ఈ టూర్​లో కొనసాగిస్తారా?
X
నోటి దూలకు ఆస్ట్రేలియా క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రత్యర్థులపై అయినదానికి కానిదానికి నోరు పారేసుకోవడం వాళ్లకు అలవాటు. బంతులతోనే కాదు తమ సూటిపోటి మాటలతోనూ ప్రత్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంటారు. సూటిపోటి మాటలతో ఆటగాళ్లను కవ్విస్తుంటారు. ఆసిస్​తో క్రికెట్​ అంటే ఈ మాటలు విని ఎంజాయ్​ చేసే ప్రేక్షకులు ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆస్ట్రేలియా క్రికెటర్ల మాటలు హద్దులు దాటాయి. ఐసీసీ మందలించే స్థాయికి వెళ్లాయి. చాలామందికి ఐసీసీ ఫైన్​లు విధించింది. అయినా వాళ్ల తీరు మారలేదు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరువు తీసింది. దీంతో వాళ్లకు కొంచెం తగ్గారు. నవంబర్ 27 నుంచి ఆసిస్​తో భారత్​ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. ఈ క్రమంలోఆస్ట్రేలియా.. ఇండియా క్రికెట్ మ్యాచ్​లు గతంలో జరినప్పుడు జరిగిన మాటల యుద్ధంపై ఓ లుక్కేద్దాం..

2018​-19 ఆస్ట్రేలియా టూర్​లో..

ఈ టూర్​లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మాటలు హద్దులు దాటాయి. ఓ దశలో ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్ రెచ్చిపోయాడు.. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఉద్దేశించి ‘నీకు వయస్సు ఐపోతుంది.. నీ పిల్లలను ఆడించు’ అన్నాడు. దీనికి పంత్​ కూడా గట్టిగా కౌంటర్​ ఇచ్చారు. ‘ నామ మాత్రపు కెప్టెన్​వు.. నువ్వేంటి నాకు చెప్పేది’ అంటూ సమాధానం చెప్పాడు పంత్​

నోరుపారేసుకున్న జేమ్స్ ఫాల్క్‌నర్..

2016 పర్యటనలో ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్.. విరాట్ కోహ్లీపై బూతుల వర్షం కురిపించాడు. అప్పుడు ఓ మ్యాచ్​లో విరాట్​ 73 పరుగులతో క్రీజ్​లో ఉన్నాడు. అయినా జేమ్స్​ ఏవేవో మాట్లాడుతూ కోహ్లీని తిడుతున్నాడు. అయితే విరాట్​ అన్న మాటలు మాత్రమే స్టంప్​ మైక్​లో రికార్డ్​ అయ్యాయి. ‘ ఎందుకయ్యా పిచ్చిపిచ్చిగా అరుస్తావు.. ఇప్పటికే నువ్వు వేసిన బంతులను నీ.. పగిలేలా కొట్టా. ఇంకా ఎందుకు అరుస్తావు’ అంటూ కోహ్లీ గట్టిగా కౌంటర్​ ఇచ్చాడు. ఈ మ్యాచ్​లో విరాట్​ 113 పరుగులు కొట్టాడు.

సచిన్​నూ వదల్లేదు..

ఆస్ట్రేలియా నోటి దూల క్రికెటర్లు ప్రొఫెషనల్​ బ్యాట్స్​మెన్​ సచిన్​ టెండూల్కర్​ను కూడా వదల్లేదు. 2003-04 ఆసీస్ పర్యటనలో భాగంగా సచిన్​ క్రీజ్​లో ఉన్నాడు. కానీ గాయం కారణంగా అతడు ఆడలేక మధ్యలోనే వెళ్లిపోయాడు. ఈ సందర్భంలో మైకెల్​ క్లార్క్​ నోరు పారేసుకున్నాడు. ‘ ఓల్డ్​ బ్యాట్స్​మెన్​ వెళ్లిపోతున్నాడు’ అంటూ వెకిలిగా నవ్వాడు. దీన్ని సచిన్​ మౌనంగా భరించాడు. కానీ సెహ్వాగ్​ మాత్రం కౌంటర్​ ఇచ్చాడు. ‘సచిన్​ చేసిన సెంచరీలంత లేదు నీ వయసు.. హద్దుల్లో ఉండి మాట్లాడు’ అంటూ కౌంటర్​ ఇచ్చాడు. క్లార్క్​ మరింత రెచ్చిపోయి జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంతో సెహ్వాగ్​ కూడా నువ్వే జాతి కుక్కవు.. అంటూ వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఇది పెద్ద వివాదాస్పదమైంది.

కొత్తవాళ్లే కాదే.. పాత వాళ్లదీ అదే పద్ధతి..!

అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ల ఇప్పటి వాళ్లు ఇలా వ్యవహరిస్తున్నారు అనుకోవడానికి లేదు. వాళ్లకు ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. 1991-92 పర్యటనలో నాటి ఆస్ట్రేలియా ప్లేయర్ విట్నీమేడ్‌ రవిశాస్త్రిపై నోరు పారేసుకున్నాడు. బ్రేక్ టైమ్‌ వరకూ క్రీజ్​లో ఉంటే నీ తలపగలగొడతానంటూ విట్నీ మేడ్​ వాగాడు. దీంతో రవిశాస్త్రి కూడా కౌంటర్​ ఇచ్చాడు. నీ ఆవేశం, కోపం ఆటలో కనబరిస్తే ఓ నాలుగురోజులు జట్టులో కొనసాగుతావంటూ బదులిచ్చాడు శాస్త్రి.