Begin typing your search above and press return to search.

ఐఎస్ హిట్ లిస్ట్ లో ఆస్ట్రేలియా!

By:  Tupaki Desk   |   4 Aug 2016 8:10 AM GMT
ఐఎస్ హిట్ లిస్ట్ లో ఆస్ట్రేలియా!
X
ప్రపంచం మొత్తాన్ని తమ వికృత చేష్టలతో వణిస్తున్న సమస్య ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ. ప్రపంచంలోని అగ్రదేశాల దగ్గరనుండి చిన్న చిన్న దేశాల వరకూ ఐఎస్ ఒక పెద్ద సమస్యగా తయారయ్యింది. తమ ఉగ్రవాద చర్యలు ఏయే దేశాలపై చేయాలనే అంశంపై ఈ ఉగ్రవాద సంస్థ ఒక హిట్ లిస్ట్ కూడా భారీస్థాయిలో తయారుచేసుకుందట. అయితే ఈ విషయాలపై అమెరికా కంగ్రెషనల్ కమిటీ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ఉన్న దేశాలకు ర్యాంకులు కూడా ఇచ్చింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్ట్‌ లో ఉన్న పాశ్చాత్య దేశాల్లో ఆస్ట్రేలియా చేరింది. అమెరికా కంగ్రెషనల్ కమిటీ ఇచ్చిన ఈ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. ఆ లిస్ట్ లో ఆస్ట్రేలియాకు మూడో ర్యాంక్ ఇచ్చారు. ఒక్కో దేశానికి ఐఎస్ కుట్రలతో ఉన్న సంబంధాలను బట్టి, 2014 నుంచి ఇప్పటివరకూ జరిగిన 101 ఉగ్రవాద దాడులను విశ్లేషించి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ లిస్టులో మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. మొదటి రెండు స్థానాల్లో అమెరికా - ఫ్రాన్స్ లు ఉన్నాయి.

ఈ విషయాలపై స్పందించిన ఆస్ట్రేలియా మంత్రి జస్టిస్ మినిస్టర్ మిఖాయిల్ కీనన్.. ఈ నివేదికలో కొత్త విషయాలేమీ లేవని, ఈ నివేదిక వెల్లడించిన అన్ని విషయాలు తమకు ముందే తెలుసునని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని - ఐఎస్ కన్ను ఆస్ట్రేలియాపై పడినా ఎదుర్కోగల సత్తా మరేదేశానికీ లేనిస్థాయిలో తమకు ఉందని కీనన్ తెలిపారు. అయితే ఉగ్రవాదులు ఆస్ట్రేలియాపై కన్నేయడానికి గల కారణలు.. తమ దేశంలోని జీవనశైలి ద్వేషించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.