Begin typing your search above and press return to search.

ఇవాంక ట్రంప్‌ తో భేటీ అయిన ఆస్ట్రేలియా మంత్రికి కరోనా వైరస్

By:  Tupaki Desk   |   14 March 2020 4:26 AM GMT
ఇవాంక ట్రంప్‌ తో భేటీ అయిన ఆస్ట్రేలియా మంత్రికి కరోనా వైరస్
X
ఆస్ట్రేలియా హోమ్ అఫైర్స్ మినిస్టర్‌ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గతవారం సదరు మినిస్టర్ అటార్నీ జనరల్ విలియమ్ బార్ - సీనియర్ వైట్ హౌస్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ - ఇతర అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇది కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు గుప్పింట్లో పెట్టుకుంటున్నారు. చైనాలోని వూహాన్‌ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా 5వేలమందికి పైగా మృతి చెందారు. ఇందులో 3వేల మందికి పైగా చైనా వారే. ఇటలీలో 1,016 - ఇరాన్‌ లో 514 - సౌత్ కొరియాలో 97 మంది - ఫ్రాన్స్‌ లో 61 మంది - అమెరికాలో 41 మంది మృత్యువాత పడ్డారు.

లక్షా ముప్పై వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రి పీటర్ డుట్టన్‌ కు కరోనా సోకింది. గతవారం ఇవాంకతో భేటీ అయ్యారు. కొద్ది రోజులకే డుట్టన్‌ కు కరోనా పాజిటివ్ తేలడం ఆందోళన కలిగిస్తోంది. తనకు కరోనా సోకినట్లు పీటర్ డుట్టన్ స్వయంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.

శుక్రవారం ఉదయం తాను లేచే సమయానికి జ్వరం - గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్‌ తో బాధపడ్డానని - ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్లు తేలిందని పేర్కొన్నారు. డుట్టన్ వారం క్రితం ఇవాంకా ట్రంప్ - బార్ - డైరెక్టర్ ఆప్ ది డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ జో గ్రోగన్ తదితరులతో అమెరికాలో భేటీ అయ్యారు.

ఆస్ట్రేలియా మంత్రికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో బార్ చాలా ఆరోగ్యంగానే ఉన్నారని - ఎలాంటి కరోనా లక్షణాలు లేవని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ స్పోక్స్‌ వుమెన్ కెర్రీ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో 156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు.