Begin typing your search above and press return to search.
రికార్డు విజయం: విశ్వకప్ ఆస్ట్రేలియా మహిళా జట్టుదే
By: Tupaki Desk | 3 April 2022 4:30 PM GMTఅందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితం వెల్లడైంది. క్రికెట్ విశ్వ కప్ విజేతగా ఆస్ట్రేలియా మహిళా జట్టు నిలిచింది. తాజా విజయంతో వరుసగా ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆసీస్ జట్టు ఇంగ్లండ్ మీద ఘన విజయాన్ని సాధించింది. విశ్వ కప్ ను మరోసారి సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళా జట్టు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి.. విశ్వ విజేతగా నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ముందు ఉంచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 285 పరుగులకే ఆలౌట్ కావటంతో విజేతగా ఆసీస్ నిలిచింది. ఇంగ్లండ్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నటాలీ సీవర్ 148 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఆమె ఒంటరి పోరు చేసినా.. జట్టును గెలిపించలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా బ్యాటర్ లు దుమ్మ దులిపారు. ఇంగ్లండ్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన హేలీ 170 పరుగులు చేయగా.. హేన్స్ 68 పరుగులు చేశారు. తొలి వికెట్ కు 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించటం.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఈ జోరును కొనసాగించటంతో భారీ స్కోర్ కు సాధ్యమైంది. 138 బంతుల్లో 170 పరుగులు చేసిన హేలీ తన ఇన్నింగ్స్ లో ఏకంగా 26 ఫోర్లు సాధించారు. ఒక్క సిక్స్ కూడా లేకపోవటం గమనార్హం. మొత్తం ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
భారీ లక్ష్య చేధనుకు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లను ఆసీస్ జట్టు దెబ్బ తీసింది. ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్ ను షురూ చేసినంతనే వికెట్లను కోల్పోవటంతో ఇబ్బందుల్లో పడింది. అనంతరం తరచూ వికెట్లు కోల్పోవటం.. బ్యాటర్లు కుదురుకోకపోవటంతో అపజయాన్ని అంగీకరించక తప్పలేదు. ఇంగ్లండ్ బ్యాటర్లలో సీవర్ ఒక్కరే ఒంటరి పోరు చేశారు. ఆమెకు మరెవరు అండగా నిలిచినా ఫలితం మరోలా ఉండేది.