Begin typing your search above and press return to search.
మోడీని ఆస్ట్రేలియా కూడా ఫాలో అయింది
By: Tupaki Desk | 15 Dec 2016 5:23 AM GMTప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని 100 డాలర్ల నోటును రద్దు చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే సోమవారం జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ఆస్ట్రేలియా రెవెన్యూ - ఆర్థికశాఖ మంత్రి కెల్లీ ఓ డయర్ ఏబీసీ రేడియోతో మాట్లాడుతూ.. నల్లధనాన్ని అరికట్టే దిశగా 100 డాలర్ల నోటు రద్దు - నగదు చెల్లింపుల అంశాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నల్లధనం వల్ల దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పెద్ద మొత్తంలో రెవెన్యూ కోల్పోతున్నదని అన్నారు. దీంతో పన్ను చెల్లింపులు జరుగడం లేదని వెల్లడించారు. నల్లధనం కట్టడి కోసం నియమించే టాస్క్‌ఫోర్స్ విభాగానికి అధిపతిగా కేజీఎంజీ గ్లోబల్ మాజీ చైర్మన్ మైఖేల్ ఆండ్రూను నియమించే అవకాశముందని ఏబీసీ రేడియో పేర్కొంది.
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో (జీడీపీ)లో 15 శాతం మేర నల్లధనం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 100 డాలర్ల నోట్లు 300 మిలియన్ల మేర చెలామణిలో ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 92 శాతం కరెన్సీ 50 డాలర్లు, 100 డాలర్ల రూపంలోనే చెలామణిలో ఉన్నట్టు సమాచారం. నోట్ల రద్దు వ్యవహారంలో భారత్ అనుసరించిన విధానానికి భిన్నంగా ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు అంశంపై ప్రజలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను అందిస్తున్నది. భారత్ లో నోట్ల రద్దు ప్రకటన వచ్చేవరకు ఆ అంశాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన సంగతి తెలిసిందే. భారత్‌లో ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే ఇండోనేషియా ప్రభుత్వం కూడా నోట్లను రద్దు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/