Begin typing your search above and press return to search.
సెకనులో వెయ్యి హెచ్ డీ సినిమాలు డౌన్ లోడ్?
By: Tupaki Desk | 24 May 2020 6:30 PM GMTమీరు విన్నది నిజమే. సెకను అంటే.. ఎంత తక్కువ సమయమో తెలిసిందే. అంత స్వల్ప వ్యవధిలో వెయ్యి హెచ్ డీ సినిమాల్ని డౌన్ లోడ్ చేసేలా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటా సాంకేతికతను రూపొందించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. దీనికి అవసరమైన ఒక అప్టికల్ చిప్ ను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా నెట్ కనెక్షన్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవటానికి ఈ టెక్నాలజీ సాయం చేస్తుందని చెబుతున్నారు.
ఒకే కాంతి వనరు నుంచి సెకనుకు 44.2 టెరాబిట్ల డేటా వేగాన్ని తాజా పరిశోధనతో కనుగున్నట్లు చెబుతున్నారు. మెల్ బోర్న్ లోని ఆర్ఎంఐటీ వర్సిటీ నుంచి క్లేటన్ మోనాష్ వర్సిటీ మధ్య 76.6 కిలోమీటర్ల అప్టికల్ ఫైబర్లపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో మైక్రో కోంబ్ అనే కొత్త పరికరాన్ని ఉపయోగించారు.
80 లేజర్లకు సమానమైన సామర్థ్యం ఉన్న ఈ మైక్రో కోంబ్ చాలా చిన్నదిగా ఉందని చెబుతున్నారు. ఒక్కో లేజర్ ను ప్రత్యేక కమ్యునికేషన్ మార్గంగా ఉపయోగించుకునే వీలుంది. ఒక్కో చానల్ గుండా గరిష్ఠ డేటాను బదిలీ చేసే విషయంలో సక్సెస్ అయ్యారు. ఈ ప్రయోగంలో భాగంగా 44.2 టీబీపీఎస్ డేటా వేగాన్ని సాధించటం గమనార్హం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికి వారు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అంతేకాదు.. డేటా వినియోగం భారీగా పెరిగిపోతోంది.
ఆఫీసు పనుల కోసం.. సామాజిక సంబంధాల కోసమేకాదు.. వీడియోల స్ట్రీమింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరగే వీలున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో సెల్ఫ్ కార్లు.. ఫ్యూచర్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలతో పాటు.. వైద్యం.. విద్య.. ఆర్థిక రంగం.. ఈ కామర్స్ పరిశ్రమలకు ఈ ప్రయోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మరీ అద్భుత టెక్నాలజీ సామాన్యుడి చేతికి ఎప్పటికి వస్తుందో?