Begin typing your search above and press return to search.
టెన్నిస్ స్టార్ కు ఆస్ట్రేలియా షాక్.. కోర్టుకెక్కిన జకోవిచ్
By: Tupaki Desk | 7 Jan 2022 7:30 AM GMTటెన్నిస్ స్టార్ జకోవిచ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడిని 8 గంటలు ఎయిర్ పోర్టులోనే అధికారులు నిలిపివేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా అతడి వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొనేందుకు ఈ సెర్బియా ఆటగాడు బుధవారం మెల్ బోర్న్ చేరుకున్నాడు. అయితే కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించిన తగిన ఆదారాలు సమర్పించని కారణంగా జకోవిచ్ ను నిలిపివేసినట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. దీంతో 8 గంటల పాటు జకోవిచ్ మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఈ ఘటనపై సెర్బియా ప్రభుత్వం మండిపడింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడితో ఇలాగేనా వ్యవహరించేది అని ఆ దేశ ప్రెసిడెంట్ అలెక్సాండర్ వ్యూకిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సైతం స్పందించారు. తమ దేశ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. ఏ వ్యక్తికి అయినా ఒకే రకమైన విధానాలు నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇక తాను వ్యాక్సిన్ వేసుకోలేదని అనుమతించని ఆస్ట్రేలియా ప్రభుత్వంపై టెన్నిస్ స్టార్ జకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు. ముందు మినహాయింపునిచ్చి ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాక అడ్డగింత ఏంటని ప్రశ్నించాడు. ఆ దేశ ప్రభుత్వం, ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులపై మండిపడ్డారు. జకోవిచ్ పిటీషన్ పై అసీస్ కోర్టు సోమవారం విచారించనుంది. అప్పటివరకూ అతడు ఆస్ట్రేలియాలో ఉంటాడా? లేక వెనక్కి వెళుతాడా? అన్నది వేచిచూడాలి.
కాగా ఆస్ట్రేలియా ఓపెన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా జకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్ నిలిచాడు.