Begin typing your search above and press return to search.
ఆస్ట్రేలియా కార్చిచ్చు మిగిల్చిన దారుణ విషాదమిదీ!
By: Tupaki Desk | 5 Jan 2020 11:11 AM GMTమొన్ననే ప్రపంచానికి ఆక్సిజన్ ఎక్కువగా అందించే దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. లక్షల ఎకరాల అడవులు తగలబడి జంతువులు చనిపోయి విషాదం అలుముకుంది. ఆ ఘటన మరవకముందే తాజాగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చుతోంది.
ఆస్ట్రేలియాలో ఇది భీకర వేసవి కాలం. ఉష్ణోగ్రతలు 48.9 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 23న మొదలైన కార్చిచ్చు ఆస్ట్రేలియా అడవులను దహించివేస్తోంది. ఇప్పటివరకూ ఈ మంటలకు 24మంది మరణించారు. లక్షలాది జంతువులు ఈ కార్చిచ్చులో పడి చనిపోయాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మంటలను అదుపుచేయడానికి 3000 మంది సైనికులను రంగంలోకి దింపింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంటలను ఆర్పడానికి సహకరిస్తున్నారు.
కార్చిచ్చు వల్ల విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిని సిడ్ని సహా ప్రధాన నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మొత్తం ఆస్ట్రేలియా వ్యాప్తంగా 60లక్షల హెక్టార్లలో అడవులు కాలిపోయాయి. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కార్చిచ్చు ప్రాంతంలో పర్యటించి సహాయ సహకారాలు పర్యవేక్షిస్తున్నారు. వేలాది ఫైర్ ఇంజిన్లు, విమానాలతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.