Begin typing your search above and press return to search.
అందుకే ఇండియా అంటే ఇష్టమన్న ఆసీస్ క్రికెటర్!
By: Tupaki Desk | 21 March 2020 12:30 AM GMTతనకు ఇండియా అంటే చాలా ఇష్టం అంటున్నాడు ఆస్ట్రేలియన్ కోచ్ జస్టిన్ లాంగర్. ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో ఒకరిగా పేరుంది లాంగర్ కు. ప్రత్యేకించి టెస్టు స్పెషలిస్టుగా లాంగర్ పేరెన్నికగన్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రోజుల్లో ఆ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా వ్యవహరించాడు లాంగర్. అలా ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన ఆటతీరుకు ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.
ఇక కొన్నేళ్ల కిందట ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు సంక్షోభంలో పడినప్పుడు.. లాంగర్ ను కోచ్ గా ఎంపిక చేశారు. ఆ జట్టును గాడిన పెట్టడంలో కూడా లాంగర్ కు పేరు వచ్చింది. ఇక తన క్రికెటింగ్ అనుభవాలను పంచుకుంటూ.. ఇండియాలో ఉండే క్రికెట్ ఆదరణ గురించి లాంగర్ ప్రస్తావించాడు.
తాము ఆట కోసం ఇండియాకు వచ్చిన సందర్భాల్లో ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ ఉండేదని లాంగర్ అన్నాడు. అందుకే ఇండియా తనకు చాలా ఇష్టమని అంటున్నాడు. అంతే కాదట.. కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే తాము బస చేసిన హోటల్స్ లోకి వచ్చేవారని లాంగర్ గుర్తు చేసుకున్నాడు. హోటల్స్ లో బెల్ బాయ్స్ లా బయటి వాళ్లు వచ్చే వాళ్లని, తమతో ఫొటోలు దిగి వెళ్లే వారని లాంగర్ అన్నాడు.
క్రికెటర్లతో ఫొటోల కోసం హోటల్ వెయిటర్స్ లా వచ్చేందుకు కూడా ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ వెనుకాడే వారు కాదని, ఆటపై వారికి ఉండే మక్కువ అలాంటిదని లాంగర్ అన్నాడు. క్రికెట్ అంటే అలా పడిచచ్చే ఇండియా ఒక క్రికెటర్ గా తనకూ ఇష్టముందని లాంగర్ వ్యాఖ్యానించాడు.