Begin typing your search above and press return to search.

లుంగీ కట్టుకుని రోడ్డుపై షాపింగ్‌ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌

By:  Tupaki Desk   |   5 April 2019 5:00 PM IST
లుంగీ కట్టుకుని రోడ్డుపై షాపింగ్‌ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌
X
మాజీ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌, గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌ లో ఆడిన మాథ్యూ హైడెన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ 12కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా చెన్నైలో మ్యాచ్‌ సందర్బంగా అక్కడకు వెళ్లిన మాథ్యూ అక్కడ సాంప్రదాయ వస్త్రధరణలో రోడ్డు మీద షాపింగ్‌ కు వెళ్లి అందరికి షాక్‌ ఇచ్చాడు. మాథ్యూ లుంగీ కట్టుకుని రోడ్డు మీద ఒక వాచ్‌ ను కొనుగోలు చేశాడు. రెండువందల రూపాయలు చెప్పిన వాచ్‌ ను 180 రూపాయలకు బేరం ఆడి మరీ కొనుగోలు చేశాడు.

ఈ విషయాన్ని స్వయంగా మాథ్యూ తన సోషల్‌ మీడియా వాల్‌ పై పోస్ట్‌ చేశాడు. చెన్నై లోని టీ నగర్‌ రోడ్ల మీద తాను చిన్న చిన్న షాపింగ్‌ చేశానని, లుంగీ కట్టుకుని తాను బయటకు వెళ్తే గుర్తు పట్టలేదని చెప్పుకొచ్చాడు. ఒక లోకల్‌ బాయ్‌ సాయంతో అతడికి వంద రూపాయలు ఇచ్చి మాథ్యూ టీ నగర్‌ వీధుల్లో తిరిగాడట. చివరకు తాను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అంటూ షేర్‌ వాట్సన్‌ తో తన ఛాలెంజ్‌ గురించి చెప్పుకొచ్చాడు. వెయ్యి రూపాయల ఛాలెంజ్‌ తో తాను లుంగీ కట్టుకుని టీ నగర్‌ వీధుల్లో షాపింగ్‌ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. సరదాగా తాను చేసిన షాపింగ్‌ కు సంబంధించిన ఫొటోలను మాథ్యూ పోస్ట్‌ చేశాడు.