Begin typing your search above and press return to search.

కరోనా పరిశోధనల్లో ఆస్ట్రేలియా సైంటిస్టుల తాజా విజయమిది

By:  Tupaki Desk   |   17 March 2020 12:30 PM GMT
కరోనా పరిశోధనల్లో ఆస్ట్రేలియా సైంటిస్టుల తాజా విజయమిది
X
అంతా బాగున్న వేళ.. అనుకోని విపత్తు మానవాళి మీద విరుచుకుపడటం ఇప్పటివరకూ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తాం. వెండితెర మీద ఈ విపత్తు ఉద్వేగానికి.. ఉత్సుకతకు లోనయ్యేలా చేయటం.. హీరో రంగ ప్రవేశం చేసి.. ప్రపంచం మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. రీల్ కు రియల్ కు మధ్య వ్యత్యాసం ఎంత ఉందన్న విషయం తాజాగా కరోనా పుణ్యమా అని ప్రతిఒక్కరికి అర్థమయ్యే పరిస్థితి.

కరోనాకు వ్యాక్సిన్ లేకపోవటం.. దాన్ని రూపొందించే పనిలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమైతే.. దాన్ని చేజిక్కించుకోవటం కోసం అమెరికా అధ్యక్షుడే స్వయంగారంగంలోకి దిగటం లాంటి వార్తల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఇదిలా ఉంటే.. కరోనా మీద జరుగుతున్న పరిశోధనల్లో ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు ఒక కీలక అంశాన్ని గుర్తించారు. కరోనాను నిలువరించటంలో ఈ అంశం సాయంగా నిలుస్తుందని చెబుతున్నారు.

మనిషి రోగ నిరోధక వ్యవస్థలు కరోనా వైరస్ ను ఫ్లూ వ్యాధిలా ఎదుర్కొంటాయన్న విషయాన్ని గుర్తించారు. కరోనా బారిన పడిన నలభై ఏళ్ల మహిళకు ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ డోహర్టీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీకి చెందిన సైంటిస్టులు పరీక్షలు జరిపారు.ఆమె.. కరోనా వైరస్ బారి నుంచి ఎప్పుడు విముక్తి అవుతుందన్న విషయాన్ని కచ్ఛితంగా చెప్పగలిగారు.

దీంతో.. తమ పరిశోధనలు కరోనాకు సంబంధించిన కీలక అంశాన్ని గుర్తించినట్లుగా భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా పలువురు కోలుకుంటుంటే.. కొందరు మరణిస్తున్నారు. ఇలాంటివేళ.. కరోనా వైరస్ తీవ్రత ఎంత ఉంది? దాన్ని అధిగమించే అవకాశం రోగికి ఎంతకాలానికి వస్తుందన్న విషయం తాజా పరిశోధనలు సాయం చేస్తాయంటున్నారు.