Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా సైంటిస్టుల సరికొత్త ప్రయోగం.. కరోనా పై పైచేయి

By:  Tupaki Desk   |   30 Jan 2020 12:30 PM GMT
ఆస్ట్రేలియా సైంటిస్టుల సరికొత్త ప్రయోగం.. కరోనా పై పైచేయి
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయటానికి సైంటిస్టులు కిందా మీదా పడుతున్నారు. ఇది పుట్టిన చైనాలో అయితే.. సైంటిస్టులు దాని అంతు చూసేందుకు ఎంతగా ట్రై చేస్తున్నా ఫలితం పాజిటివ్ గా లేని పరిస్థితి. ఇలానే ఉండిపోతే.. మరో పది రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పటివకే వందల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో వైపు వేలాది మంది ఈ వైరస్ బారిన పడటమే కాదు.. ఈ పిశాచి వైరస్ అంతకంతకూ విస్తరిస్తూ పలు దేశాలకు పాకుతోంది.

ఇలాంటివేళ.. ఆస్ట్రేలియా కు చెందిన సైంటిస్టులు కరోనా వైరస్ పై తొలిసారి పైచేయి సాధించారు. తొలిసారి వారు చైనా వెలుపల కరోనా వైరస్ ను రీక్రియేట్ చేశారు. ఇది కచ్ఛితంగా ఘన విజయమేనని వారు చెబుతున్నారు. అంటు వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ మైక్ కాటన్.. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తాజా ఫలితం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అసలైన వైరస్ ఎలా పుడుతుందన్న విషయం పై అవగాహన వస్తే.. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలన్న విషయం అర్థం కావటమే కాదు.. దాని పీచమణచటం సాధ్యమవుతుంది. తాజాగా విజయవంతమైన ప్రయోగం నేపథ్యం లో.. రానున్న రోజుల్లో కరోనాను కంట్రోల్ చేసే వాక్సిన్ ను తయారు చేయటం వీలవుతుందని చెబుతున్నారు.