Begin typing your search above and press return to search.
కంగారూలూ... ఈ చికెన్ గోలేంటీ?
By: Tupaki Desk | 20 Sep 2017 5:25 PM GMTటీమిండియాతో క్రికెట్ సిరీస్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు... నానా యాగీ చేస్తోంది. మొన్న చెన్నై చెపాక్ స్టేడియంలో కోహ్లీ సేన చేతిలో చిత్తుగా ఓడిన ఆసీస్ జట్టు... ఆ తర్వాత టీమిండియాతో పాటు నేరుగా కోల్‌కతా చేరుకుంది. రేపు ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో నేటి ఉదయం ఆసీస్ జట్టు కాస్తంత తీవ్రంగానే చెమటోడ్చింది. ఎందుకంటే... మొన్నటి ఓటమికి బదులివ్వాలి కదా. టీమిండియాకు బదులిచ్చే సంగతేమో గానీ... ఆసీస్ జట్టు ఆటగాళ్లు కోల్‌కతా క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)కు చుక్కలు చూపించడం మాత్రం షురూ చేసేశారు. వర్షం కారణంగా ప్రాక్టీస్ కూడా అంతగా జరగనప్పటికీ... విడతలవారీగా కంగారూలు తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ ప్రాక్టీస్ చేశారట. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ... తమ అతిథులుగా విచ్చేసిన కంగారూ ఆటగాళ్లకు క్యాబ్ అధికారులు అన్ని సౌకర్యాలు బాగానే కల్పిస్తున్నారు. ఆసీస్ క్రికెటర్లకు ఏఏ వంటకాలు ఇష్టమో కనుక్కుని మరీ... వంటవాళ్లకు లిస్టు చెప్పి మరీ చేయిస్తున్నారు.
అయితే వంట వాళ్లు చేసిన ఓ చిన్న పొరపాటును ఆసరా చేసుకుని కంగారూలు క్యాబ్ అధికారులను నిజంగానే కంగారు పెట్టేశారు. కంగారూల గోల విన్న క్యాబ్ అధికారులు అప్పటికప్పుడు రంగంలోకి దిగి... జరిగిన పొరపాటును వెనువెంటనే సరిచేయడంతో పాటు మళ్లీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగనివ్వబోమని, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, దానిని మనసులో పెట్టుకోవద్దని కూడా మర్యాదపూర్వకంగానే చెప్పారట. అయితే చెపాక్ ఓటమితో సెగలు కక్కుతున్న ఆసీస్ ఆటగాళ్లు మాత్రం కుక్ చేసిన చిన్న పొరపాటును పట్టుకుని నానా రాద్ధాంతం చేశారు. అయినా కంగారూల గోలకు అసలు కారణమేమిటో తెలుసా?... వారికి అందించిన చికెన్ స్థాయికి మించి ఉడిచికిండచమేనట. ఆసీస్ క్రికెటర్లకు 73 డిగ్రీల వద్ద ఉడికించిన చికెన్ ఇష్టపడతారట. ఇదే విషయాన్ని వారు తమను సంప్రదించిన క్యాబ్ అధికారులకు చెప్పారు. ఆ విషయాన్ని క్యాబ్ కూడా... కుక్‌కు సవివరంగానే చెప్పేసింది.
అయితే సదరు కుక్... ఏ ధ్యాసలో ఉన్నాడో గానీ... ఆసీస్ క్రికెటర్లకు అందించిన చికెన్‌ను స్థాయికి మించి ఉడికించాడట. దానినే తీసుకుని వారికి అందించాడట. అయినా మేము అడిగింది గ్రిల్డ్ చికెన్ అయితే... అతిగా ఉడికించిన చికెన్ ఇస్తావేమిటీ? అని కుక్‌ను ఆసీస్ క్రికెటర్లు నిలదీసినంత పనిచేశారట. అంతేకాకుండా ఒకరిద్దరు క్రికెటర్లు కుక్‌కు లెఫ్ట్ అండ్ రైట్ పీకారట. కుక్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న క్యాబ్ అధికారులు పరుగు పరుగున అక్కడికి వచ్చి మరోమారు ఇలాంటి పొరపాటు జరగనివ్వమని చెప్పడంతో ఆసీస్ క్రికెటర్లు సర్దుకున్నారట. అయినా కావాల్సింది అడిగి మరీ చేయించుకోవాలి గానీ... ఏదో చిన్న పొరపాటు జరిగితే... దానిని కూడా ఇంత రాద్ధాంతం చేయాలా? అన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా... కంగారూ జంతువుల దేశం నుంచి వచ్చిన ఆసీస్ క్రికెటర్లు... ఆ జంతువు లాగే ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడుతూ ఇతరులను కూడా కంగారు పెట్టేశారన్న మాట.