Begin typing your search above and press return to search.

వ్యవసాయం లో అద్భుతాలు చేస్తోన్న ఆ దేశ మహిళలు .. ఎలా అంటే?

By:  Tupaki Desk   |   13 Nov 2021 2:30 AM GMT
వ్యవసాయం లో అద్భుతాలు చేస్తోన్న ఆ దేశ మహిళలు .. ఎలా అంటే?
X
వ్యవసాయం .. ప్రపంచంలో వ్యవసాయ రంగానికి మించిన పారిశ్రామిక రంగం లేదు. కానీ ప్రస్తుత రోజుల్లో వ్యవసాయం అంటే అందరికి ఒక బరువు , అలుసుగా మారిపోయింది. కానీ ఇండియా తో పాటుగా ఆస్ట్రేలియా దేశాల మహిళలు వ్యవసాయం లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మగవారితో పొడి పడుతూ వారి కంటే తామేమి తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం ఆహారోత్పత్తికి మహిళలు ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళల ఉపాధిలో దాదాపు మూడోవంతు వ్యవసాయంలోనే ఉండటం విశేషం.

ఇందులో అటవీ పెంపకం, చేపలు పట్టడంపై ఫోకస్ పెట్టారు. ఇక అధిక ఆదాయం కలిగిన దేశాలలో మహిళా రైతుల శాతం పది శాతం కంటే తక్కువగా ఉండగా, తక్కువ ఆదాయం దిగువ ,మధ్య ఆదాయ దేశాలలో మహిళలకు వ్యవసాయం అత్యంత ముఖ్యమైన ఉపాధి రంగం. అయినప్పటికీ పురుషుల కంటే మహిళా రైతులకు చాలా తక్కువ భూమిలో ఎక్కు లాభాలను అందుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ భూస్వాముల్లో మహిళలు 12.8% మాత్రమే ఉన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర చరిత్రలో సమానంగా గుర్తించడంలో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది. 2016లో ఆస్ట్రేలియా వ్యవసాయ శ్రామిక శక్తిలో 32 శాతం మంది మహిళలు ఉన్నారని సెన్సస్ డేటా వెల్లడించింది. నేడు వారు ఆస్ట్రేలియా వ్యవసాయ ఆదాయంలో కనీసం 48 శాతం ఉత్పత్తి మహిళలే చేస్తున్నారని తేలింది.

వ్యవసాయంలో చాలా మంది మహిళలు సాంప్రదాయ మూస పద్ధతులను ధిక్కరించి వ్యవసాయ ,పరిశ్రమ రంగంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. సామాజిక, పర్యావరణ న్యాయ స్ఫూర్తితో మహిళా రైతులు అభివృద్ధి చెందుతున్నారు.

వ్యవసాయాన్ని మార్చడం సాధ్యమని, వ్యవసాయం లాభదాయకమని నిరూపించాలని చూస్తున్నారు. కాస్మోస్ మ్యాగజైన్ ప్రకారం.. న్యూ ఇంగ్లండ్, ఎన్ ఎస్ డబ్య్లు విశ్వవిద్యాలయం లో రాజకీయ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ సంబంధాలలో లెక్చరర్ అయిన డాక్టర్ లూసీ న్యూసోమ్ వ్యవసాయ సంస్థలో మహిళలు ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటారు.