Begin typing your search above and press return to search.

మోడీషాలను తిట్టినందుకు రచయిత అరెస్ట్

By:  Tupaki Desk   |   2 Jan 2020 6:33 AM GMT
మోడీషాలను తిట్టినందుకు రచయిత అరెస్ట్
X
దేశంలో వ్యక్తి పూజకు నిదర్శనమీ సంఘటన.. ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్ర్యం తగలబడిన ఘటన.. ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షాలు తెచ్చిన పౌరసత్వంపై ఒక రచయితగా అభ్యుదయ వాదిగా విమర్శలు గుప్పించిన ప్రముఖ తమిళ రచయిత నెల్లై కన్నన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది.

మోడీషాలు తెచ్చిన పౌరసత్వసవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఈ ర్యాలీ సందర్భంగా మోడీ, షాలను దూషిస్తూ రచయిత నెల్లై కన్నన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై బీజేపీ సీరియస్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు దిగింది. పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. రచయితను అరెస్ట్ చేయాలంటూ మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేతలు బైఠాయించారు. ఆందోళన ఉదృతం చేస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి పోలీసులను హెచ్చరించారు. దీంతో నెల్లై కన్నన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనను పట్టుకొని అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. తమిళనాడు లో బీజేపీ కి మద్దతు గా ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండడంతో మోడీషాలను తిట్టినందుకు ఇలా రచయితను అరెస్ట్ చేయించింది. ఇది తమిళనాట తీవ్ర దుమారం రేపుతోంది.