Begin typing your search above and press return to search.

కోవిడ్ బాధితులకు 'ఆటో' అలర్ట్

By:  Tupaki Desk   |   2 Jan 2022 6:42 AM GMT
కోవిడ్ బాధితులకు ఆటో అలర్ట్
X
కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మార్చి-ఏప్రిల్ తర్వాత కాస్త తగ్గిన వైరస్ విజృంభణ.. మళ్లీ విస్తరిస్తోంది. కాగా మనదేశంలో మహమ్మారి దశ నుంచి సాధారణ జలుబు స్థాయికి చేరిందని పలువురు నిపుణులు చెప్పారు. కానీ తాజా అధ్యయనంలో వెలువడిన ఫలితాలు మాత్రం కలకలం రేపుతున్నాయి. సాధారణంగా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తిలో యాంటీ బాడీలు తయారవుతాయి. మరి వాటిలో ప్రతికూల యాంటీబాడీలు ఉంటున్నాయి. ఆ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రోగి శరీరంలో రోగ నిరోధక శక్తిని కలిగి ఉండే యాంటీ బాడీలు... మళ్లీ వైరస్ బారిన పడకుండా ఉండేలా రక్షణ కల్పిస్తాయి. ఒకసారి వైరస్ సోకితే... రెండోసారి పాజిటివ్ వచ్చినా పెద్దగా ముప్పు ఉండదు. అయితే కరోనా పలు రూపాలుగా పరిణామాలు చెందుతున్న దృష్ట్యా ఆటో యాంటీ బాడీలు విడుదలవుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. దీనివల్ల ప్రతికూల వ్యాధినిరోధక శక్తి కలుగుతుందని పేర్కొన్నారు.

ఆటో యాంటీ బాడీలు మానవ శరీరంలో దాదాపు ఆరు నెలల వరకు ఉంటాయి. అవి మన శరీరంలో ముఖ్య భాగాలు గుండె, ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థ, కళ్ళు, చర్మం పై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పలు అవయవాలు అంతర్గతంగా వాపు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ బాధితుల్లో ఈ ఆటో వైరస్ యాంటీబాడీలు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి. అయితే వీటి బాధితులు ఎక్కువగా పురుషులే ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు పరిశీలించిన అధ్యయనాల్లో పురుషుల్లోనే ఆటో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఇకపోతే దేశంలో వైరస్ కొత్త వేరియంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అతి వేగంగా వ్యాప్తి చెందే గుణాలు కలిగిన ఒమిక్రాన్ పంజా దృష్ట్యా... పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి.

దాదాపు రెండేళ్ల నుంచి విలవతాండవం చేస్తున్న మహమ్మారి... దశలవారీగా విజృంభిస్తోంది. ఓవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల... మరోవైపు అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కొత్త కేసులు... ఇవి చాలవన్నట్లు కరోనా ఆటో యాంటీబాడీలు. ఇదంతా చూస్తుంటే రాబోయే మూడు నెలలు గడ్డు పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.