Begin typing your search above and press return to search.

అమ్మఒడి + విద్యాదీవెన + ఆటో+ టైలర్ + రైతు భరోసా ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Jun 2020 7:30 AM GMT
అమ్మఒడి + విద్యాదీవెన + ఆటో+ టైలర్ + రైతు భరోసా ఎంతో తెలుసా?
X
ఏపీ సీఎం జగన్ నగదు బదిలీ ఎంత గొప్పగా అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి లబ్ధి చేకూరేలా ఉన్నాయా? దాదాపు 40శాతం మంది ఉన్న టీడీపీ సానుభూతి పరులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారంతా వైసీపీకి ఓటు వేసే రకమే కాదు.. ఇదే సమయంలో వైసీపీని నమ్ముకొని అభిమానిస్తున్న వైసీపీ క్షేత్రస్థాయి నేతలకు నిజంగా నగదు బదిలీలో లబ్ధి చేకూరుతోందా? ఈ నగదు బదిలీపై వైసీపీ నేతలు ఏమంటున్నారనే దానిపై ఆరా తీయగా నమ్మశక్యం కానీ రీతిలో స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. నగదు బదిలీ వల్ల కొన్ని కుటుంబాలు ఎంత లాభ పడుతున్నాయో అని గ్రామాల్లో ఉన్న వైసీపీ వర్గాలు విచిత్రం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక పక్కా టీడీపీ కుటుంబానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ కు చెందిన కుటుంబానికి ఈ పథకాల లబ్ధి భారీగా చేకూరిందట.. ఆ ఆటో డ్రైవర్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు. వారిలో అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.

ఈ నేపథ్యంలో వీరికి వైసీపీ ప్రభుత్వం సాయం అందింది. అమ్మ ఒడి కింద రూ.15వేలు , జగన్ అన్న విద్యాదీవెన కింద రూ.20వేలు, ఆటో డ్రైవర్ కావడంతో ఆ పథకంలో రూ.10వేలు , ఇతడి భార్య టైలర్ కావడంతో రూ.10వేలు , రైతు భరోసా కింద రూ.7500తోపాటు మోడీ ఇచ్చిన 6000 తో రూ.13500 లబ్ధి చేకూరాయి.

మొత్తం ఆ కుటుంబానికి అక్షరాల రూ.68500 సాయం జగన్ ప్రభుత్వం నుంచి అందినట్టు అయ్యింది. దీంతో అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది. ఇదేమీ డబ్బులు రా నాయనా అని వైసీపీ నేతలు కూడా తలపట్టుకుంటున్నారు. తాము పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నామని.. మాకు ఈ సాయం రాలేదని.. నీకు టీడీపీలో ఉన్న ఇంత డబ్బులు వస్తున్నాయని సదురు ఆటో డ్రైవర్ తో వాపోయారట.. దానికి ఆ ఆటో డ్రైవర్ సీఎం జగన్ ఎంత డబ్బులు ఇచ్చినా నా ఓటు ‘టీడీపీకే’ అని అనడం కొసమెరుపు. ఈ విషయం విని వైసీపీ వర్గాలు షాక్ కు గురికావడం వారి వంతైంది. ఇలా డబ్బుల పంపిణీ నిజమైన పేదలకు, వైసీపీ నేతలకు అయినా దక్కుతుందా అన్న సందేహాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ని నమ్ముకొని ఉన్న వారికి కూడా దక్కడం లేదని.. కనీసం న్యాయం చేయాల్సిన అవసరం ఉందని వారు మొత్తుకుంటున్నారు.