Begin typing your search above and press return to search.
భారత్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆటో మొబైల్ దిగ్గజం
By: Tupaki Desk | 14 Feb 2022 4:33 AM GMTప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ భారత్ లో రీ ఎంట్రీ ఇవ్వనుందా అంటే... నిజమే అంటున్నారు పరిశ్రమ వర్గాలు. 2021లో భారత్ లో తన కార్ల తయారీ కి పుల్ స్టాప్ పెట్టిన ఈ సంస్థ మరోసారి భారత్ లో అడుగు పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పీఎల్ఐ పథకం పై మొగ్గు చూపిన ఈ సంస్థ మనం దేశ నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్దమౌంతోందని పరిశ్రమల వర్గాలు తెలిపాయి.
అమెరికాకు చెందిన ఈ ఆటో మొబైల్ దిగ్గజానికి గతంలో భారత్ లో రెండు కార్ల తయారీ ప్లాంట్ లు ఉండేవి. అయితే వాటి నుంచి కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు గత ఏడాది సెప్టెంబర్ లో ఫోర్డ్ ప్రకటించింది. కానీ విద్యుత్ వాహనాల ఉత్పత్తి కి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతను చూసిన ఫోర్ట్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పీఎల్ఐ పథకం కోసం అప్లై చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మరల ఈ సంస్థ భారత్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
పీఎల్ఐ పథకం ద్వారా కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న ఫోర్డ్ సంస్థ గుజరాత్ లోని తన తయారు ప్లాంట్ అయిన సనద్ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. కేవలం తయారీ మాత్రమే కాకుండా ఇక్కడ ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకుగానూ కేంద్రం సంస్థ చేసుకున్న దరఖాస్తుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇదే జరిగితే కేవలం అతి తక్కువ కాలంలోనే ఈ కార్ల తయారీ భారత్లో ఊపందుకోనుంది.
విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్లు, ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఆటో మొబైల్ తయారీ కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దేశీయంగా తయారీ పెంచడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి చూస్తోంది కేంద్ర సర్కార్.
ఈ పథకం కింద కేవలం ఫోర్డ్ మోటార్స్ మాత్రమే గాక ఇంకా కొన్ని దిగ్గజ కంపెనీలు రాయితీల కోసం అప్లై చేసుకున్నాయి. ముఖ్యంగా మేకిన్ ఇండియా ను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫోర్డ్ మోటార్స్ పీఎల్ఐ కింద అప్లై చేసుకున్న దానికి కేంద్ర ఆమోదం తెలిపింది. ఇందుకు గాను ఆ సంస్థ మోదీ సర్కార్ కు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.