Begin typing your search above and press return to search.
ప్రధాని, సీఎం ప్రసంగాలకు చప్పట్లు కొట్టేది వీరే
By: Tupaki Desk | 13 Jan 2017 4:31 PM GMTఇదో క్రేజీ ఆఫర్. సాధారణంగా మనం గమనించే ప్రకటనలు ఎలా ఉంటాయి? మీ ఇంట్లో గ్యాస్ స్టౌ, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ - ప్లంబరింగ్ పనులు చేయడానికి పనివారు కావాలా? అయితే సంప్రదించండి... అంటూ పలుచోట్ల అతికించిన ప్రకటనలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అయితే, చెన్నయ్ లోని సెమ్మంజేరికి చెందిన ఆటో డ్రెవర్ వివేకానందన్ తన ఆటోపై ఉంచిన ఓ ప్రకటనను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఆటో వెనకవైపు కూలి మనుషులు కావాలంటే సంప్రదించండి అని ఓ ప్రకటన కనిపిస్తోంది. అందులో భవిష్యత్తు ప్రధానికి - ముఖ్య మంత్రికి జేజేలు కొడుతూ నినాదాలు చేయడానికి మనుషులు కావాలా? అయితే, ఈ ఫోన్ నెంబరుకి సంప్రదించండి అంటూ ఓ ఫోన్ నెంబరు ఉంచాడు. తద్వారా కొత్త బిజినెస్ మోడల్ కు శ్రీకారం చుట్టాడు.
ప్రస్తుతం రాజకీయనాయకులకు జేజేలు కొట్టడానికి మనుషులు కావాలని తెలుసుకున్న సదరు డ్రైవరు ఈ ప్రకటన చేస్తున్నాడు. తద్వారా నిరుద్యోగులను ఆదుకుంటాడట. ఈ విషయం గురించి ఆ ఆటోడ్రైవర్ మాట్లాడుతూ... తాను పదేళ్లుగా ఆటోను నడుపుతున్నానని చెప్పాడు. ఎనిమిదేళ్లుగా పేపర్లలో వచ్చే ప్రధాన వార్తలను తన ఆటో వెనుక రాస్తున్నానని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తమ ప్రాంతంలో కొంత మందికి పనులు దొరకడం లేదని, ప్రస్తుత రాజకీయాల్లో నేతలకు జేజేలు కొట్టడానికి భారీ సంఖ్యలో మనుషులు అవసరమవుతున్నట్లు తాను తెలుసుకున్నానని, అందుకే తాను తన ఆటోపై ఆ ప్రకటన అంటించానని చెప్పాడు. రాజకీయనాయకులు రోజుకు ఒక మనిషికి రూ.300 ఇస్తే తాను కనీసం 100 మందిని జేజేలు కొట్టడానికి పంపించగలుగుతానని పేర్కొన్నాడు. ఆవిష్కరణలకే తాత లాంటి క్రేజీ ఆఫర్ కదా ఇది. ఏమంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/