Begin typing your search above and press return to search.
ఆటోమేషన్ ఎఫెక్ట్ .. 5మందిలో ఇద్దరి జాబ్ ఫట్ .. సర్వే లో కీలక విషయాలు
By: Tupaki Desk | 19 March 2021 12:30 PM GMTసాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్ది సంప్రదాయ శ్రామికశక్తికి నష్టం జరుగుతుంది. ఆటోమేషన్ ఆందోళన కలిగించేస్థాయిలో ఉద్యోగాలను నాశనం చేస్తుంది. తాజాగా PwC సర్వేలో కూడా ఇదే తేలింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అన్ని రంగాల్లోను ఆటోమేషన్ వేగంగా జరుగుతోందని, వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని దాదాపు నలభై శాతం మంది ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. భారత్ సహా 19 దేశాల్లో ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగిన సర్వేలో 32,500 మంది పాల్గొన్నారు.
ఈ సర్వే లోని కీలక విషయాల గురించి చూస్తే...ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని 60 శాతం మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 48 శాతం మంది భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు ఉండవని అభిప్రాయపడ్డారు. 39 శాతం మంది తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళనగా ఉన్నారు. లాక్ డౌన్ తో తమ డిజిటల్ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40 శాతం మంది తెలిపారు. కొత్త నైపుణ్యాలపై దృష్టి సారించినట్లు ఎక్కువమంది తెలిపారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77 శాతం మంది, పని ప్రదేశాల్లో కొత్త టెక్నాలజీని స్వీకరించేందుకు 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు
కరోనా తర్వాత సొంత వ్యాపారంపై ఎక్కువ మంది దృష్టి పెట్టారు. పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వలన కెరీర్ పురోగతి, శిక్షణ కోల్పోతున్నట్లు 50 శాతం మంది తెలిపారు. సమాజానికి సహకరించే సంస్థలో పని చేయాలని 75 శాతం మంది కోరుకుంటున్నారు. ఇది ముఖ్యంగా చైనా (87 శాతం), భారత్ (90 శాతం)లో ఎక్కువగా ఉంది. సౌతాఫ్రికాలోను 90 శాతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పిల్లలు, కుటుంబం వంటి వివిధ ఆర్థిక కారణాలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉండే సంస్థలకు మొగ్గు చూపుతున్నారు.