Begin typing your search above and press return to search.
భూమా కుటుంబంతో కటీఫ్..మాట వినకపోతే ఆమె ఖర్మ
By: Tupaki Desk | 26 April 2018 4:13 AM GMTఆళ్లగడ్డలో ఇటీవల తనపై జరిగిన దాడిపై ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.ఏవీ సుబ్బారెడ్డిపై ఆళ్లగడ్డలో జరిగిన రాళ్లదాడి ఘటనపై తనని కలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువర్గాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏవీ సుబ్బారెడ్డి అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. అయితే మంత్రి అఖిలప్రియ ఈ సమావేశానికి రాలేదు. దీనిపై మీడియా ఆరా తీయగా తనకు సమాచారం లేదని ఆమె తెలిపారు. దీంతో ఈ సమావేశాన్ని గురువారం 4 గంటలకు వాయిదా వేశారు. జిల్లా ఇంచార్ట్ వర్ల రామయ్యను కలుసుకున్న ఏపీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో తనపై జరిగిన దాడిని వివరించారు.
అనంతరం ఏవీ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సైకిల్ యాత్రలో భాగంగా తనపై జరిగిన రాళ్ళ దాడి జరిగిందని, మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రికి పిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలు మేరకు నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తుంటే దాడి చేయటం దారుణమని అన్నారు. తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని స్పష్టం చేశారు. `చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు. అలాంటిది ఆమె గురించి మాట్లాడాలంటే నా పెద్దిరికం అడ్డు వస్తోంది. ప్రత్యర్థులు కూడా నాపై దాడి చేయడానికి సాహసం చేయరు. అలాంటిది ఆమె నాపైనే దాడి చేయిస్తుందా?.ఏవీ సుబ్బారెడ్డి అంటే భయం - భక్తి లేదు. కనీసం వయస్సుకు కూడా పెద్దరికం ఇవ్వలేదు. ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం..వ్యక్తిగతంగా ఉన్న విషయాలు వ్యక్తిగతంగా చూసుకోవాలి.. అంతే కానీ పార్టీ కార్యక్రమంలో జరిగేటప్పుడు ఇలాంటి దాడి చేయటం అనేది హేయమైన చర్య` అంటూ మండిపడ్డారు.
దాడి విషయని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకే అమరావతి వచ్చానని సుబ్బారెడ్డి తెలిపారు. ``మంత్రి అఖిల ప్రియను - నన్ను రామన్నారు. మంత్రి రాలేదు..రేపు వస్తారు అని ఇంఛార్జ్ మంత్రి చెప్పారు ..అందుకే రేపు మళ్లీ నన్ను రమ్మన్నారు. అందుకు నేను సిద్ధం.తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుంది..పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి.. వినకపోతే వారి ఖర్మ` అని స్పష్టం చేశారు. `నాది - నాగిరెడ్డిది జిల్లాలోనే ఆదర్శ మిత్ర బంధం అంటారు..రాజకీయ - వ్యాపారం - ఫ్యాక్షన్ పరంగా కానీ 35 సంవత్సరం కలిసి ఉన్నాం..ఎప్పుడు విభేదాలు రాలేదు..కానీ అఖిలప్రియతో ఎందుకు విబేధాలు వస్తున్నాయో ఆమె చెప్పాలి` అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.