Begin typing your search above and press return to search.
బాబును ఇరకాటంలో పెడుతున్న ఏవీ సుబ్బారెడ్డి
By: Tupaki Desk | 23 Feb 2019 4:15 AM GMTచంద్రబాబు కేబినెట్లో మంత్రి అఖిలప్రియ తండ్రి భూమానాగిరెడ్డి బతికున్న కాలంలో ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారారు. ఆయన ఓపెన్ డిమాండ్లతో అటు అఖిలప్రియ గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తుండగా.. ఇటు చంద్రబాబును కూడా ఇరకాటంలో పెడుతున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల - ఆళ్లగడ్డ స్థానాల్లో ఏదో ఒకటి తనకు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఒకటి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇంకో స్థానం ఆ కుటుంబానికే చెందిన బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏవీ సుబ్బారెడ్డి తన బహిరంగ డిమాండ్లతో కాక పుట్టిస్తున్నారు.నంద్యాల నియోజకవర్గం టికెట్ ను తనకు చంద్రబాబు కేటాయిస్తారన్న నమ్మకం ఉందని సుబ్బారెడ్డి అంటున్నారు.. అక్కడ, తనకు బలమైన కేడర్ ఉందని చెప్పారు. నాడు భూమా నాగిరెడ్డి కోసం తన సీటును త్యాగం చేసి - నంద్యాల నుంచి పోటీ చేశానని అన్నారు.
భూమా కుటుంబానికి రెండు సీట్లు ఉన్నాయి కనుక అందులో ఒక సీటును తన కోసం త్యాగం చేయమని కోరుతున్నానని అన్నారు. నంద్యాల లేదా ఆళ్లగడ్డ స్థానాల్లో అధిష్ఠానం ఏది కేటాయించినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇప్పటికే సర్వేలు చేసి ఉంటారని - గెలిచే అభ్యర్థులకే టికెట్లు లభిస్తాయని - అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ తాను ఆశపడటంలో తప్పు లేదని అన్నారు. కేడర్ అంతా తన వైపే ఉందని, ఈ విషయాన్ని చంద్రబాబుని కలిసి చెబుతానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.
దీంతో చంద్రబాబు ఇటు భూమా అఖిలప్రియకు హ్యాండివ్వలేక.. అటు సుబ్బారెడ్డి లాంటి నేతను వదులుకోలేక తెగ టెన్షన్ పడుతున్నారట.