Begin typing your search above and press return to search.

మొన్న అంబటి.. నేడు అవంతి.. జగన్ సర్కారుకు చిరాగ్గా మారిన రాసలీలల

By:  Tupaki Desk   |   21 Aug 2021 9:23 AM GMT
మొన్న అంబటి.. నేడు అవంతి.. జగన్ సర్కారుకు చిరాగ్గా మారిన రాసలీలల
X
సాంకేతిక అంతకంతకూ ఎక్కువైన నాటి నుంచి సమస్యలు పెరుగుతున్నాయి. నిజమా? అబద్ధమా? అన్న సందేహాలకు గురి చేసేలా వెలుగు చూస్తున్న ఆడియో టేపులు కొన్ని రాజకీయ అలజడికి గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఉదంతం ఒకటి ఏపీ అధికారపక్షాన్ని ఇబ్బందికి గురి చేస్తోంది. మొన్నామధ్యన వైసీపీ నేత కమ్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంబటి రాంబాబుకు చెందినట్లుగా చెప్పే ఆడియో టేప్ తెగ వైరల్ అయ్యింది. గుర్తు తెలియని మహిళతో ఆయన రొమాంటిక్ గా మాట్లాడినట్లుగా ఉండే ఆడియో బయటకు రాగా.. అంబటిని దాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆడియో టేపులో తన గొంతును కాపీ చేశారని.. తప్పుడు టేపులతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివాదం ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు పేరుతో ఒక రాసలీలల ఆడియో టేప్ వైరల్ గా మారింది. ఇందులోని అంశాలు కాస్తంత ప్రైవేటుగా ఉన్నాయి. దీనిపై తాజాగా మంత్రి రియాక్టు అయ్యారు. తన పేరుతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే.. తన రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక.. తనను దెబ్బ తీయటం కోసమే ఈ ఆడియో నాటకాన్ని మొదలు పెట్టారని మంత్రి అవంతి మండిపడుతున్నారు. ఈ ఆడియోక్లిప్ పై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.

సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అంచలంచెలుగా ఎదిగిన తాను.. ఎమ్మెల్యే స్థానం నుంచి మంత్రి పదవి వరకు వచ్చినట్లుగా గుర్తు చేస్తున్నారు. తన ఎదుగుదలను జీర్ణించుకోలేక.. మహిళల్లో తనకు పెరుగుతున్న ఇమేజ్ ను దెబ్బ తీయటం కోసమే ఈ చిల్లర చేష్టలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా తనపై పోటీ చేసిన ప్రత్యర్థుల్ని సైతం మిత్రులుగానే చేసే వ్యక్తినని తన గురించి తాను గొప్పలు చెప్పుకున్న అవంతి.. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల్ని ప్రచారం చేస్తున్నారని మండపడ్డారు.

మొత్తంగా ఈ ఎపిసోడ్ లో నిజానిజాలు ఏమిటన్నది పోలీసులు నిర్దారించాల్సి ఉంది. ఏమైనా.. తమ పార్టీకి చెందిన ముఖ్యనేతలకు సంబంధించినవని చెబుతూ.. ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వచ్చిన రాసలీలల ఆడియో క్లిప్పులు ఏపీ అధికారపక్షానికి తలనొప్పిగా మారాయి. మరి.. వీటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కన్నేసి ఉంచాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.