Begin typing your search above and press return to search.
అవంతి క్వశ్చన్!... లోకేశ్ ఆన్సరిస్తారా?
By: Tupaki Desk | 8 March 2019 5:37 PM GMTఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో అధికార టీడీపీ - విపక్ష వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడే దాకా టీడీపీలోనే ఉండి.... ఇప్పుడు వైసీపీలో చేరిపోయిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీ నేతలను - ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు - ఆయన కుమారుడు - మంత్రి నారా లోకేశ్ లను టార్గెట్ చేసుకుని సంధిస్తున్న విమర్శలు నిజంగానే వైరల్ గా మారిపోతున్నాయి. ముక్కు సూటిగా అవంతి సంధిస్తున్న ప్రశ్నలతో చంద్రబాబు - లోకేశ్ లు సతమతమైపోతున్నారన్న వాదనా లేకపోలేదు. అవంతి నోట నుంచి ఏ ప్రశ్న వినిపించినా.. చాలా స్పష్టతతో సరిగ్గా పాయింట్ బేస్ ను ఆధారం చేసుకుని సంధిస్తుండటంతో... అసలు ఆ ప్రశ్నలకు స్పందించేందుకు ఒక్క టీడీపీ నేతకు కూడా దమ్ము చాలడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజాగా అలాంటి ముక్కుసూటి ప్రశ్నను మరొకదానిని సంధించిన అవంతి... టీడీపీ నోట మాట రాకుండా చేశారని చెప్పాలి. అయినా అవంతి సంధించిన తాజా ప్రశ్న ఏమిటంటే... రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు - 13 జిల్లాలు ఉంటే... ఒక్క విశాఖ జిల్లా - భీమిలి నియోజకవర్గంపైనే లోకేశ్ ఎందుకు దృష్టి సారించారు? ఈ తరహా ప్లాన్ లో లోకేశ్ లక్ష్యం ఏమిటి? అంటూ ప్రశ్నించిన అవంతి... వాటికి సమాధానాలు కూడా చెప్పే యత్నం చేశారు. అభివృద్ధిలో ఎంతో ముందు ఉన్న విశాఖ జిల్లా భీమిలి నియోజవర్గంలో పోటీ చేయడం ద్వారా మరింతగా దోచుకునే లక్ష్యంతోనే లోకేశ్ ఇక్కడ పోటీకి ఆసక్తి చూపుతున్నారని అవంతి ధ్వజమెత్తారు.
అభివృద్ధిలో ఎంతో ముందున్న భీమిలి కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి కదా... వాటిలో దేనిలోనే ఒక దానిలో లోకేశ్ పోటీ చేస్తే... అవి కూడా అభివృద్ది బాటలోకి వస్తాయి కదా అని కూడా అవంతి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబును టార్గెట్ చేసిన అవంతి... సరిగ్గా ఎన్నికల ముందు పసుపు - కుంకుమ చెక్కులు అందజేస్తున్న చంద్రబాబుకు.. గత ఐదేళ్లుగా మహిళలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నలకు చంద్రబాబు - లోకేశ్ ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.