Begin typing your search above and press return to search.
అవంతి.. బంతి.. మళ్లీ సోషల్ మీడియాలో 'సరస సంభాషణ'..ఏకంగా డార్లింగ్ అంటూ!
By: Tupaki Desk | 14 Nov 2022 5:39 AM GMTఒక్కసారి అంటే.. ఏదో పొరపాటు అనుకోవచ్చు. లేదా ప్రత్యర్థులుకుట్ర పన్నారని తప్పించుకోవచ్చు. కానీ, పదే పదే అదే స్వరం.. అదే డైలాగులు మరింత మసాలా జోడిస్తే ఏమనుకోవాలి? కాదని ఎలా తప్పించు కుంటారు? ఇదే ఇప్పుడు ఏపీ మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకుడు అవంతి శ్రీనివాస్‌కు ఎదురైంది. తాజాగా ఆయన సరస సంభాషణలకు సంబంధించి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీనిలో 'లవ్ యూ బంగారం.... ఐ లవ్ యూ డార్లింగ్.... నీతో మాట్లాడి ఎన్నాళ్లైందో.. ముందు నీ ఫొటో పంపు.. నాలుగో తేదీన ఢిల్లీలో కలుద్దామా' అంటూ ఓ మహిళతో జరిపిన సంభాషణలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఆ స్వరం అవంతిదే నని పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. కొన్ని ఛానళ్లు ఆయన ఫొటోతో సహా కథనాలు ప్రసారం చేయడంతో కలకలం రేగింది.
ఫోన్లో మాట్లాడిన మహిళ తాను హైదరాబాద్‌లోని 'ప్రియాంక రెసిడెన్సీ'లోకి ఇల్లు మారుతున్నానని చెప్పగా... తన కుమార్తె చాలా షార్ప్ అని, పసిగట్టేస్తుందని... అక్కడికి ఎందుకని’ ఇవతలి వ్యక్తి ప్రశ్నించారు. గతంలో అవంతి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితతో ప్రేమపూర్వక సంభాషణలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. తన గొంతును అనుకరించి ఫేక్ సంభాష ణలు రికార్డు చేశారని ఆయన సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తును అధికారులు ఇంకా పూర్తి చేయనే లేదు. వాస్తవాలు ఏమిటన్నవి బయటపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన స్వరంతో పోలిన మరో 'వాయిస్ క్లిప్పింగ్' వెలుగు చూడటం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయగా.. మళ్లీ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.
కావాలని ఎవరైనా చేస్తున్నారా?మాజీ మంత్రి అవంతి వ్యవహారంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్న ఆయన కు ఇవన్నీ మామూలేనని ఒకరిద్దరు ఆరోపిస్తున్నారు. అయితే.. మెజారిటీ వ్యక్తులు మాత్రం ప్రత్యర్థులు ఉద్దేశ పూర్వంగానే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. ఆయన బలహీనతను అడ్డం పెట్టుకుని.. ఇతర మహిళలు ఆడియోలు రికార్డు చేసి బయటకు వదిలి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు.
జగన్ ఏం చేస్తారు?గతంలో 'అరగంట వచ్చిపో!' అంటూ.. అవంతి ఆడియో టేప్ బయటకు వచ్చింది. దీనిపై రాజకీయంగా తీవ్ర రచ్చ సాగింది. అయితే, ఎంత రగడ జరిగినా.. పార్టీ అధిష్టానం ముఖ్యంగా సీఎం జగన్ పట్టించుకోలేదు. 'ఇది విపక్షాల కుట్ర' అన్న ధోరణిలో వ్యవహరించారు. ఇక, ఇప్పుడు వెలుగు చూసిన టేపులో డార్లింగ్ అంటూ పెద్ద పదాలే ఉన్న నేపథ్యంలో ఈ సారైనా దీనిపై ఆయన దృష్టి పెడతారా? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి ఏం చేస్తారో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.