Begin typing your search above and press return to search.
రాజధాని పై ఆందోళన చెందుతోంది రైతులు కాదు చంద్రబాబు : అవంతి
By: Tupaki Desk | 14 Jan 2020 11:02 AM GMTఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో రగడ కొనసాగుతుంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన విషయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు భోగి పండుగ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంత రైతులతో కలిసి భోగి మంటలు వేసిన చంద్రబాబు జీఎన్ రావు కమిటీ నివేదికను, బోస్టన్ కమిటీ నివేదికను భోగి మంటల్లో కాల్చేశారు.
అంతే కాదు ఈ నివేదికలతో సంబంధం లేదని రాజధాని అమరావతి కోసం ఎంత దాకైనా పోరాటం సాగిస్తామని చెప్పారు. ఇక చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్ . చంద్రబాబు నాయుడు ముందు నారాయణ కమిటీ నివేదికను తగలబెట్టాలని ఆ తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచించాలని సూచించారు. అమరావతిలో ఆందోళన చేస్తున్నది రైతులు కాదని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యాబ్రికేట్ ఉద్యమం చేయిస్తున్నాడని మండిపడ్డారు.
విశాఖ మురళినగర్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి అవంతి రాజధానిలో కొనసాగుతున్న నిరసనల పట్ల తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రకటన ముందుచూపుకు అద్దం పడుతోందన్నారు.అమరావతి రైతులకు అండగా అని చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తుంది దొంగ ఉద్యమం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇక, తెలుగు దేశం పార్టీకి - చంద్రబాబుకు భవిష్యత్ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.