Begin typing your search above and press return to search.

అవంతిని ఆగమాగం చేసిన ఆడియో క్లిప్ లో ఉన్నది ఇదేనట

By:  Tupaki Desk   |   21 Aug 2021 8:00 AM GMT
అవంతిని ఆగమాగం చేసిన ఆడియో క్లిప్ లో ఉన్నది ఇదేనట
X
ఏపీ మంత్రి ఇరుకున పడ్డారు. ఒక రాజకీయ నేత మీద ఎలాంటి ఆరోపణ పడకూడదో అలాంటిదే పడటంతో ఆయన ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. తనకే పాపం తెలీదని ఆయన కిందా మీదా పడుతున్నా.. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల పుణ్యమా అని జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒక మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేశారని.. ఆయన బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాన్ని చెప్పేలా ఉన్న ఆడియో (?) ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఇంతకీ ఆ ఆడియో క్లిప్ లో ఏముంది? ఎందుకంత వైరల్ గా మారింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బెదిరించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ను చూస్తే.. ‘‘పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. అరగంటలో పంపిచేస్తాను. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా? ఏం చేస్తున్నావ్? రాకపోతే నీ ఇష్టం. వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ ఒక మహిళతో అవంతి శ్రీనివాస్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో వైరల్ గా మారింది.

ఇది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే నకిలీ ఆడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. తనను డ్యామేజ్ చేయటమే వారి లక్ష్యమని మండిపడుతున్నారు. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. తనకు ఎవరి మీదా అనుమానాలు లేవని చెబుతున్నారు. ఎవరెవరో ఫోన్లు చేసి అడుగుతుంటే తనకు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై పార్టీ అధినాయకత్వం సీరియస్ గా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే పలు సమస్యలతో బండి లాగుతున్న జగన్ సర్కారుకు తాజాగా ఉదంతం మరో తలనొప్పిగా మారినట్లుగా చెప్పాలి. తాను దేవుడ్ని నమ్మే వ్యక్తినని.. తనను ఇబ్బంది పెట్టే వారు ఇబ్బంది పడటం ఖాయమని ఆయన మండిపడుతున్నారు. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని.. కేసును వారు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

నిజంగానే మహిళను బెదిరింపులకు గురి చేయటమే నిజమైతే.. ఏ నేత ఇంటికి రమ్మని చెప్పరు కదా? ఈ చిన్న పాయింట్ చాలు కదా? అది ఫేక్ అని చెప్పటానికి అంటూ అవంతి వర్గానికి చెందిన నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. గొంతును మార్ఫింగ్ చేశారే తప్పించి.. ఆడియో క్లిప్ ఫేక్ అని పేర్కొంటున్నారు. మరి.. పోలీసులు ఏం చేస్తారో చూడాలి.