Begin typing your search above and press return to search.
43.5కోట్ల మంది డేటాను అమ్ముకున్న యాంటి వైరస్ కంపెనీ
By: Tupaki Desk | 29 Jan 2020 6:49 AM GMTకంప్యూటర్లు, ఫోన్ల లో మన డేటా భద్రం కాదని మరోసారి తేలిపోయింది. కంప్యూటర్లు, ఫోన్లు వైరస్ బారిన పడకుండా మనం వాడే సాఫ్ట్ వేర్లు ఇప్పుడు మన డేటాను కోట్లకు బేరం ఆడేసి అమ్ముకుంటున్న వైనం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
తాజాగా మదర్ బోర్డు, పీసీ మ్యాగ్ అనే రెండు కంపెనీల పరిశోధనలో సంచలన విషయం వెలుగుచూసింది. కంప్యూటర్లు, ఫోన్లలో వైరస్ నియంత్రణకు మనం వాడే ‘అవాస్ట్’ అనే యాంటీ వైరస్ సంస్థ తన కస్టమర్ల డేటా అమ్ముకుంటున్నట్టు పరిశోధనలో వెల్లడైంది. చిన్నా పెద్దా కంపెనీలకు ఏక మొత్తంగా.. సబ్సిడీ తో ఆ వివరాలు ఇచ్చినట్టు తేలింది.
మనం ఎప్పుడెప్పుడు ఏం చూశాం, ఏ లోకేషన్ లో ఉన్నాం.. పోర్న్ వెబ్ సైట్స్ చూసిన డేటా.. మన సెర్చ్ చేసిన విషయాలన్నింటిని , చూసిన వెబ్ సైట్లు, వీడియోలు, ఇలా ఇష్టాయిష్టాలన్నింటిని అవాస్ట్ కంపెనీ అమ్మేసింది. దాదాపు 43.5 కోట్ల మంది అవాస్ట్ యూజర్ల డేటాను మైక్రోసాఫ్ట్, గూగుల్, హోమ్ డిపో, పెప్సీ వంటి కంపెనీల చేతికి వెళ్లిందని తేలింది.
న్యూయార్క్ కు చెందిన ఓమినికామ్ అనే మీడియా కంపెనీ తాజాగా 45 లక్షల డాలర్లు పెట్టి మరీ అవాస్ట్ దగ్గర నుంచి యూజర్ల డేటా కొన్నట్టు సంచలనం విషయం బయటపెట్టడం కలకలం రేపింది. ఇక తమకూ థర్డ్ పార్టీ ప్రొవైడర్లతో డేటా అందిందని హోమ్ డిపో సంస్థ తెలిపింది.
దీంతో యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ అవాస్ట్ మన డేటాను కొల్లగొట్టి కోట్ల రూపాయలకు మల్టీ నేషనల్ కంపెనీలకు అమ్ముకుందని తేటతెల్లమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది.