Begin typing your search above and press return to search.

అచ్చూ న‌యీం టైపు దోపిడి

By:  Tupaki Desk   |   27 Sep 2016 10:30 PM GMT
అచ్చూ న‌యీం టైపు దోపిడి
X
నయీమ్. పేరుకు గ్యాంగ్ స్ట‌ర్‌. కానీ పోలీసుల నుంచి కళ్లు గప్పి - తన మార్గంలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలని భావించిన వేళ - కళ్లకు కాటుక - పెదవులకు లిప్‌ స్టిక్ - తలకు విగ్ - జడలో పూలు ధరించి - ఆపై అచ్చుగుద్దినట్టు అ మ్మాయిలా తయారై - ఓ బురఖా వేసుకుని పోతుంటాడని మనకు నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరమే తెలిసింది. ఇక అచ్చు గుద్దినట్టు అలాగే చేస్తూ - పోలీసుల నుంచి తప్పించుకునే బీహార్ గ్యాంగ్‌ స్టర్ కథ ఇది.

వయ్యారంగా చీర కట్టి - చూడగానే చూపు తిప్పుకోలేనంత అందగత్తె అన్న భావాన్ని కలిగిస్తూ, తానూ ఓ యువతినని కలరింగ్ ఇస్తూ - దందాలు సాగించిన అవినాష్ అనే రౌడీ విషయం తెలుసుకుని ఇప్పుడు పోలీసులే విస్తుబోతున్నారు. అమ్మాయిలకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా ముస్తాబై మోనికా అని పిలిపించుకుంటూ - అవినాష్ చేస్తున్న ఆగడాలేమిటో తెలుసా? భారీ సర్టిఫికెట్లు - నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం! ఆధార్ కార్డు మొదలు ఐఐటీ వరకూ... మధ్యలో ఉండే టెన్త్ - ఇంటర్ - డిగ్రీ - పీజీ - బీఈడీ ... ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా చిటికెలో ఇప్పించే ముఠా ఇది. ఈ ముఠాకు ఇంకో పేరు కూడా ఉంది. అదే.. గోల్డీ ముఠా! ఇక బీహార్‌ లో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా - గోల్డీ బ్యాచ్‌ లో ఎవరికి ఫోన్ చేసినా ఇంటికి మద్యం వచ్చేస్తుంది. యువతే లక్ష్యంగా ఈ ముఠా సాగించే దందాలపై పోలీసులకు ఉప్పందించాడో బాధి తుడు. పోలీసులకూ మోనికగా పరిచయమున్న ఆమె మోనిక కాదని - అవినాష్ అని తెలియడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఇప్పుడు అవినాష్‌ ను అరెస్ట్ చేసి పాత దందాలన్నింటినీ బయటకు తీసే ప్రయత్నంలో పడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/