Begin typing your search above and press return to search.
పిల్ల కావాలంటే మందుకు దూరంగా ఉండాల్సిందే
By: Tupaki Desk | 28 Oct 2019 1:30 AM GMTగుజరాత్ రాష్ట్రంలోని కలోల్ తాలూకాలోని ‘పియాజ్’ గ్రామం అది. ఆ గ్రామస్థులు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు పెళ్లి చేసుకునే యువకుల పాలిట శాపంగా మారాయి. ఎన్నో దారుణ విషాధాల తర్వాత గ్రామస్థులంతా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెళ్లికొడుకులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి..
మద్యం తాగడం ఈరోజుల్లో కామన్. మన తాతల కాలంలో మందు తాగితే పిల్లనిచ్చేవారు కాదు.. కానీ ఈ సమాజంలో అదిప్పుడు ఫ్యాషన్. ఆడవాళ్లు బీర్లు తాగుతున్న పరిస్థితి ఉంది. ఇక మగాళ్లను అడిగేవారే లేరు. అయితే ఈ గ్రామం రూటు మాత్రం సపరేట్.
పియాజ్ గ్రామ జనాభా కేవలం 6వేలు. ఠాకూర్లు రాజ్యమేలే ఈ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. పెళ్లి సంబంధం కుదిరిన కాబోయే వరుడు ముక్కు, నోరు వాసన చూడడం అక్కడ సంప్రదాయం. సుమారు 25మంది ఇలా పెళ్లికొడుకును వింతగా నోరు, ముక్కు వాసన చూస్తారు. పెళ్లికొడుకు తండ్రి, కుటుంబంలోని మగవారిని ఇలా పరీక్షిస్తారు. నిశ్చితార్థం, పెళ్లికి ముందు కూడా ఇలానే పరీక్షిస్తారు. అతడు మందు కొట్టాడని తెలిసిందా ఆ పెళ్లి క్యాన్సలే.. మద్యం తాగే అలవాటున్న భర్తల వల్ల ఆ గ్రామ మహిళల కాపురం కూలిపోయే పరిస్థితులు చూసి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాగడం అలవాటు ఉండి దాచేస్తే ఆ మహిళకు లక్ష పరిహారం ఇప్పిస్తారు.
నాలుగేళ్లుగా పియాజ్ గ్రామంలో ఈ సంప్రదాయం నడుస్తోంది. ఆ గ్రామంలో మద్యం తాగి 15మంది యువకులు ఇలా మరణించడంతో పియాజ్ గ్రామస్థులు ఇలా మందు తాగేవారికి పిల్లను ఇవ్వవద్దని నిర్ణయం తీసుకున్నారు.. మందుకొట్టినట్టు తేలితే పెళ్లి పీటమీద అయినా పెళ్లి క్యాన్సల్ చేసేస్తారు. అందుకే ఇప్పుడు ఈ ఊళ్లో అమ్మాయి కావాలంటే యువకులు మందుకు దూరంగా ఉండాల్సిందే..