Begin typing your search above and press return to search.
అసద్.. నమాజ్ మీద కూడా రియాక్ట్ కావొచ్చుగా?
By: Tupaki Desk | 29 July 2019 7:27 AM GMTఎవరి నమ్మకాలు వారివి. ఎవరి మనోభావాలు వారివి. ఒకరి నమ్మకాల్ని.. మనోభావాల్ని వేలెత్తి చూపించటంలో అర్థం లేదు. అదే సమయంలో.. తమ నమ్మకాల్ని పాటించటం కోసం వేరే వారిని ఇబ్బందికి గురి చేయటంలో అర్థం లేదు. ఇదే విషయాన్ని ఇప్పటివరకూ చెప్పని కొందరు మత పెద్దలు ఇప్పుడిప్పుడు గళం విప్పుతున్నారు.
పెద్ద ఎత్తున మైకులు పెట్టి వినాయక పందిళ్ల దగ్గర హడావుడి చేసే వారిని మనం తప్పు పడుతుంటాం. మరికొందరు ఆ మాత్రం లేకపోతే ఎలా అని సమర్థిస్తుంటారు. కానీ.. పాయింట్ ఏమంటే.. పందిళ్ల దగ్గర పూజల కోసం భారీ ఎత్తున మైకులు పెట్టి.. పొద్దున నుంచి రాత్రి వరకూ అదే పనిగా హడావుడి చేయటం అందరిని ఇబ్బంది పెట్టటమే. ఇలాంటివి వాటికి మనం ఎలా ఒప్పుకోమో.. తాజాగా ముస్లిం మత పెద్ద ఒకరు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
నమాజ్ చేసే క్రమంలో రోడ్ల మీద అడ్డంగా నమాజ్ చేయటం.. కొన్ని వీధుల్ని బ్లాక్ చేయటం చూస్తుంటాం. కానీ.. ఇది ఏ మాత్రం సరికాదని.. వీధుల్లో వేరే వారికి ఇబ్బంది కలిగించేలా నమాజ్ చేయటంలో అర్థం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరంగి మహ్ లీ.
మసీదుల్లో స్థలం లేకపోతే.. రోడ్డు మీద నమాజ్ చేస్తున్నారని.. దీని కారణంగా ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా చేయటం సరికాదన్నారు. మసీదుల బయట నమాజ్ చేసే విషయంపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వెంటనే మసీదుల్లో నమాజ్ చేసుకునేందుకు చాలినన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని అంశాల మీద చాలా పక్కాగా ఉండే.. అసదుద్దీన్ లాంటి నేతలు ఈ తరహా వ్యాఖ్యలపై దృష్టి సారించి.. దాన్నిపాటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పెద్ద ఎత్తున మైకులు పెట్టి వినాయక పందిళ్ల దగ్గర హడావుడి చేసే వారిని మనం తప్పు పడుతుంటాం. మరికొందరు ఆ మాత్రం లేకపోతే ఎలా అని సమర్థిస్తుంటారు. కానీ.. పాయింట్ ఏమంటే.. పందిళ్ల దగ్గర పూజల కోసం భారీ ఎత్తున మైకులు పెట్టి.. పొద్దున నుంచి రాత్రి వరకూ అదే పనిగా హడావుడి చేయటం అందరిని ఇబ్బంది పెట్టటమే. ఇలాంటివి వాటికి మనం ఎలా ఒప్పుకోమో.. తాజాగా ముస్లిం మత పెద్ద ఒకరు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
నమాజ్ చేసే క్రమంలో రోడ్ల మీద అడ్డంగా నమాజ్ చేయటం.. కొన్ని వీధుల్ని బ్లాక్ చేయటం చూస్తుంటాం. కానీ.. ఇది ఏ మాత్రం సరికాదని.. వీధుల్లో వేరే వారికి ఇబ్బంది కలిగించేలా నమాజ్ చేయటంలో అర్థం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరంగి మహ్ లీ.
తాజాగా ఆయన నమాజ్ పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదన్న మాటను చెప్పారు. నమాజ్ అనేది అల్లా ముందు చేసే ప్రార్థన అన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఇతరులను ఇబ్బంది పెట్టేలా చేయటం సమంజసం కాదన్నారు.