Begin typing your search above and press return to search.
అవగాహన, అప్రమత్తతతో మంకీపాక్స్ కు అడ్డుకట్
By: Tupaki Desk | 6 Jun 2022 11:11 AM GMTఓవైపు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మరోవైపు మంకీపాక్స్ కోరలు చాస్తోంది. ఇంకోవైపు వానాకాలం మొదలై సీజన్ వ్యాధులు షురూ అవుతున్నాయి. ఒక్కసారిగా వైరస్లు చుట్టుముట్టుతుండటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు కలవరపెడుతున్నాయి.
కరోనా వైరస్లో అల్లకల్లోలమైన ప్రపంచంపై మరోవైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే 27 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించింది.
మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారిణి మరియా వాన్ కెర్ఖోవ్ సూచించారు. ముఖ్యంగా మంకీపాక్స్ గురించి అవగాహన లేని దేశాల్లో సకాలంలో గుర్తించేలా, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించాలని అన్ని దేశాల ఆరోగ్య శాఖలను ఆదేశించారు. దీనికోసం అంతర్జాతీయ నిపుణులు, పరిశోధన సంస్థలతో త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మన వద్ద ఉన్న వైద్య సదుపాయాల ఆధారంగా వైరస్‌ను ముందుగానే గుర్తించగలుగుతున్నాం. అనుమానితులతో పాటు వారిని కలిసిన వారినీ ఐసోలేషన్ చేయాలి. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షలు చేసి, చికిత్స అందించేవారు.
ఈ వైరస్‌కు గురించి కనీస అవగాహన ఉండాలి. ఈ వైరల్ వ్యాధి చికిత్స కోసం అవసరమైన అన్ని పద్ధతులను అవలంభించాలి. ఇందుకోసం కొన్ని యాంటీవైరల్స్, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అని డబ్ల్యూహెచ్ఓ అధికారి తెలిపారు.
వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ గురించి గతంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ వైరస్ కరోనా అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది. ఈ వైరస్ను నివారించేందుకు అవసరమైన టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో పూర్తి సమాచారం లేదని తెలిపింది. వైరస్ వ్యాప్తిపై దృష్టి సారిస్తే నివారించడం అంత కష్టమేమీ కాదని పేర్కొంది.