Begin typing your search above and press return to search.

భూమిని తాకిన మేఘాలు..అద్భుతం చూస్తారా.?

By:  Tupaki Desk   |   27 Sep 2018 6:25 AM GMT
భూమిని తాకిన మేఘాలు..అద్భుతం చూస్తారా.?
X
ఎత్తుగా ఉండే మేఘాలు భూమిని తాకడం ఎప్పుడైనా చూశారా. అయితే ఈ తాజా వీడియో చూడండి. ఇది టిబెట్లోని ఓ ప్రాంతం. దట్టంగా ఉన్న మేఘాలు భూమిని తాకాయి. రాకపోకలు అంతరాయం కలిగించాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. ఈ అరుదైన దృశ్యాన్ని కమెరాల్లో బంధించారు.

టిబెట్ సముద్ర మట్టానికి 4,900 మీటర్లు లేదా 1600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా ప్రపంచ పై కప్పుగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. నేపాల్ సరిహద్దులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం టిబెట్ భూభాగానికి దగ్గరల్లోనే ఉంది.

టిబెట్ లో అతి తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా జనావాసాలు తక్కువగా ఉండి.. అత్యధికంగా నిర్జనమైన ప్రాంతం ఉంటుంది. పైగా భూమిపై అతి ఎత్తైన ప్రదేశం కావడం వల్లే మేఘాలు తాకుతున్నట్టే కనిపిస్తాయి. అయితే తాజాగా వర్షాకాలం కావడంతో మేఘాలు దట్టంగా కమ్ముకోవడం చాలా స్పష్టంగా కనిపించింది. ఇది అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. అందనంత ఎత్తులో వర్షాన్ని కుురిపిస్తున్న మేఘాలు నేలకు దిగి రావడం చాలా అరుదు. ఇది ఇప్పడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ నెటిజన్లు తెగ చూస్తున్నారు. సంబరపడుతున్నారు.