Begin typing your search above and press return to search.
యాక్సిస్ బ్యాంక్ పై మళ్లీ దాడులు
By: Tupaki Desk | 23 Dec 2016 7:19 AM GMTఐటీ శాఖ - ఈడీ దాడుల్లో కట్టలుకట్టలుగా కొత్త నల్లధనం బయటపడుతోంది. అక్కడక్కడా పాత నోట్లూ దొరుకుతున్నా పెద్ద మొత్తంలో కొత్త నోట్లు దొరుకుతుండడంతో అధికారులే షాకవుతున్నారు. బ్యాంకు లావాదేవీలపైనా ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కన్నేసింది. అహ్మదాబాద్ లోని నయాంనగర్ యాక్సిస్ బ్రాంచిపై జరిపిన దాడిలో రూ.89 కోట్ల మేర లావాదేవీలు తేడాగా ఉన్నట్లు గుర్తించింది. మొత్తం 19 ఖాతాలను పరిశీలిస్తున్నారు.
మరవైపు కేరళ - తమిళనాడు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఐటీ - సీబీఐ దాడుల్లో రూ. 200 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో ఐదుగురి నుంచి రూ.1.34 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను అధికారులు విమానాశ్రయంలో పట్టుకున్నారు. కొల్లమ్ - కొజికోడ్ - కన్నూర్ - మలప్పురమ్ లలోని జిల్లా సహకార బ్యాంకులపై ఈడీ - సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. మలప్పురం జిల్లా సహకార బ్యాంకులో లెక్కలోకి రాని రూ.260 కోట్లను గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. ఈ మొత్తంలో రూ.100 కోట్లు బ్యాంకులో ఉండగా, మిగిలిన మొత్తం నవంబర్ 10నుంచి 14 తేదీల మధ్యలో అనుబంధ బ్యాంకులకు వెళ్ళినట్లుగా గుర్తించారు. ముంబై విమానాశ్రయంలో దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడి నుంచి రూ. 2,000 నోట్ల రూపంలో ఉన్న రూ.28 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మలు - దుస్తులు - వంటపాత్రల్లో ఆయన ఈ మొత్తాన్ని దాచిపెట్టాడు. ఉత్తర్రపదేశ్ సాంబాల్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల మేరకు కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం, నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు దేశవ్యాప్తంగా ఐటీ దాడులు, సోదాలలో అధికారులు రూ.3,590 కోట్ల నల్లధనం స్వాధీనం చేసుకున్నారు. ఇదే గాకుండా రూ.92 కోట్ల మేరకు రూ.2,000 కొత్త నోట్లను కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 734 సెర్చ్ లు, సర్వేలు, విచారణ కార్యకలాపాలు చేపట్టారు. పన్ను ఎగవేత, హవాలా తరహా కార్యకలాపాలకు సంబంధించి ఈ విభాగం వివిధ వ్యక్తులు, సంస్థలకు 3,200 నోటీసులను పంపించింది. ఇదే సమయ ంలో రూ.500 కోట్ల మేరకు నగదు, ఆభరణాలను కూడా ఐటీ విభా గం స్వాధీనం చేసుకుంది. ఈ విభాగం 220 కేసులను సీబీఐ - ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తదితర విభాగాలకు అప్పగించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/