Begin typing your search above and press return to search.
బీకేర్ ఫుల్: తెలుగు రాష్ట్రాల్ని కమ్మేస్తున్న 'ఏవై.12'.. ఎన్ని కేసులంటే?
By: Tupaki Desk | 5 Sep 2021 4:30 AM GMTకొవిడ్ కేసులు తగ్గినట్లే కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే.. కేరళ మినహాయిస్తే చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు ఒక మోస్తరుగా మాత్రమే నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెకండ్ వేవ్ వేళ డెల్టా వేరియంట్ ఒక ఊపు ఊపేసిన వైనం తెలిసిందే. తాజాగా డెల్టా ప్లస్ లోని ఏవై.12 అనే ఉప రకం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కేసుల్ని గుర్తించారు. అంతకంతకూ విస్తరిస్తున్న ఈ కేసులు ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఏవై.13 రకం కేసును తొలిసారిగా ఆగస్టు 30న ఉత్తరాఖండ్ లో గుర్తించారు. వారం తిరిగేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ దర్శనమిచ్చింది. ప్రసత్తుం దేశంలోని15 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 178 కేసులు నమోదైతే.. రెండు తెలుగురాష్ట్రాల్లో 33 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్ లో నమోదైన కేసులతో పోల్చినప్పుడు జాతీయస్థాయిలో ఈ ఉప రకం కేసుల నమోదులో ఏపీ మూడో స్థానంలో ఉండటం గమనార్హం.
ఈవై.12 కేసుల్లో ఊపిరితిత్తుల కణాల్లో ఇది బలంగా అతుక్కుపోతుందని.. మోనోక్లోనల్యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. జన్యు క్రమ పరీక్షల్లో డెల్టా ప్లస్ కేసులు వెలుగు చూస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలతోనూ.. ఇతర రాష్ట్రాలతోనూ రాకపోకలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అవుతున్నాయి. దీంతో.. కేసుల వ్యాప్తి ఎక్కువ అవుతున్నాయి.
డెల్టా ప్లస్ మ్యుటేషన్ లో ఏవై.1, ఏవై.2, ఏవై.2 చొప్పున పిలుస్తున్నారు. తాజాగా రాష్ట్రాలకు పంపిన సమాచారంలో ఏవై.12 కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఉప రకం వేరియంట్ తో వచ్చిన చిక్కు ఏమంటే.. దీని విస్తరణ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని కణజాలానికి బలంగా అతుక్కుపోవటం దీనికున్న మరో దరిద్రపుగొట్టు లక్షణంగా చెప్పాలి. ఏవై.12 తీవ్రతను మరింతగా విశ్లేషించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
డెల్టా ప్లస్ కేసులు రాష్ట్రాల వారీగా చూస్తే.. టాప్ ఐదులో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం గమనార్హం. తాజాగా డెల్టా ప్లస్ నమోదు అయిన కేసులు రాష్ట్రాల ప్రకారం చూస్తే.. తెలంగాణలో 52, మహారాష్ట్రలో 47, గోవాలో 45, ఉత్తరాఖండ్ లో 27, ఏపీలో 24 కేసులు నమోదయ్యాయి. ఏపీకి పక్కనే ఉన్న ఒడిశాలో మాత్రం ఒక్క కేసునమోదు కావటం గమనార్హం. ఇక.. ఏవై.12 కేసుల విషయానికి వస్తే.. మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉంటే.. తెలంగాణ ఆరో స్థానంలో నిలవటం ఆందోళనకు గురి చేస్తుంది. ఈ కేసుల లెక్కలోకి వెళితే.. అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదైతే.. మహారాష్ట్రలో20.. ఏపీలో 18.. ఉత్తరాఖండ్ లో 18.. జమ్ముకశ్మీరర్ లో 16.. తెలంగాణలో 15 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలోని పదిహేను రాష్ట్రాల్లోనే ఈ ఉప వేరియంట్ కేసులు నమోదు కావటం గమనార్హం.