Begin typing your search above and press return to search.
అయోధ్య భూమిపూజ మూహూర్తం బాగాలేదా?
By: Tupaki Desk | 25 July 2020 9:10 AM GMTదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయవాదం.. హిందుత్వం.. సెంటిమెంట్లకు డిమాండ్ పెరిగిపోయిందంటారు. హిందువుల మనోభావాలకు పెద్దపీట వేసే పార్టీగా బీజేపీ ఇప్పుడు దేశంలో తిరుగులేని శక్తిగా ఉంది. బీజేపీ అధికారంలో స్వాములు, మఠాధిపతులు, బాబాలకు తెగ డిమాండ్ వచ్చేసింది.
ఇక దశాబ్ధాలుగా నలుగుతున్న రామ జన్మభూమి స్థలాన్ని కోర్టులో దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మూహూర్తం కూడా పెట్టింది. అయోధ్య రామాలయాన్ని నిర్మించే విషయంలో ఎన్నో హిందూ సంస్థలు.. స్వాములు భాగస్వామ్యమై ఉన్నాయి.
ఆగస్టు 5న అయోధ్య రామాలయాన్ని నిర్మించేందుకు భూమి పూజ మూహూర్తాన్ని నిర్ణయించారు. ఉదయం 11.00 గంటల నుంచి 1.10 గంటలలోపు భూమి పూజల చేయాలని మూహూర్తం పెట్టారు.
దేశమొత్తం ఎదురుచూస్తున్న శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పెట్టిన మూహూర్తం బాగాలేదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. భూమి పూజకు పెట్టిన ఘడియ శుభ ఘడియ కాదనే వాదన ఉంది.
దేశంలో ఎంతో పాపులర్ స్వామి అయిన శంకరాచార్య జ్యోతిష్క పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తాజాగా అయోధ్య రామమందిరం కోసం పెట్టిన భూమి పూజల మూహూర్తం మంచిది కాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరూ లేవనెత్తని ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం రేపారు. దశాబ్ధాల తరబడి ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి మంచి మూహూర్తం పెట్టాలంటూ ఆయన కొత్త వాదన తెరపైకి తెచ్చారు.