Begin typing your search above and press return to search.

అయోధ్య వివాదం...షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం

By:  Tupaki Desk   |   24 April 2021 3:37 AM GMT
అయోధ్య వివాదం...షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం
X
కొన్ని విషయాలు బయిట ప్రపంచానికి తెలియకుండానే సైలెంట్ గా జరుగుపోతూంటాయి. టైమ్ వచ్చినప్పుడు , ఆ విషయాలు రివీల్ అవటం వల్ల ఎవరికీ ఏ విధమైన నష్టమూ లేదనుకున్నప్పుడు బయిటకు వస్తూంటాయి. ఆలాంటిదే రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం మ్యాటర్. నిజంగానే మధ్యవర్తిగా షారూఖ్ ఖాన్ పని చేశారా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారు. అదెలా బయిటకు వచ్చిందో చూద్దాం.

రీసెంట్ గా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ విరమణ చేసారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ఫేర్ వెల్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో ఈ విషయం బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయటంతో ఇదంతా మీడియాకు ఎక్కింది.

వికాస్ సింగ్ మాట్లాడుతూ...”జస్టిస్ బాబ్డే ఓ రోజు...షారూఖ్ ఖాన్ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తారా అని నన్ను పిలిచి అడిగారు. దాంతో ఆయన మాట మేరకు నేను షారూఖ్ తో మాట్లాడాను. ఆయన సంతోషంగా దీనికి ఓకే చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన మధ్యవర్తిత్వం పని చేయలేదు.” అని చెప్పారు. ఈ సమయంలో అక్కడ జస్టిస్ బాబ్డే ఉన్నారు. వికాస్ సింగ్ చెప్పేది అంతా ఆయన వింటూనే ఉన్నారు. అంటే అది నిజమే అని ధృవీకరణ అయ్యింది. అయితే ఏ విధమైన మధ్యవర్తిత్వం అనేది మాత్రం తెలియరాలేదు.

ఇక సుప్రీం కోర్టు మొదట ముగ్గురు సభ్యులతో కూడిన పేనల్ ను అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి నియమించింది. అందులో జస్టిస్ కలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, అలాగే సీనియర్ లాయర్ శ్రీరాం పంచు లు సభ్యులు. ఈ పానెల్ చాలా సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. అప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ ఈ కేసును సుప్రీం కోర్టు పరిథిలోకి తెచ్చారు. 2019 లో సుప్రీం కోర్టు అయోధాయ్ స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని తీర్పు ఇచ్చింది.