Begin typing your search above and press return to search.
యోగీ రెడీ..మోడీ ఇలాకా కంటే భారీ విగ్రహం
By: Tupaki Desk | 27 Nov 2018 8:27 AM GMTగుజరాత్ లో నర్మదానది ఒడ్డున నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం(182 మీటర్ల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) దేశం చూపును తనవైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో అత్యంత ఎత్తైన పటేల్ విగ్రహం ఏర్పాటు చేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ...అంటే పటేల్ ఐక్యతా విగ్రహం ప్రధాని నరేంద్రమోడీ కలల ప్రాజెక్ట్. ఒకటా - రెండా అనేక ప్రత్యేకతలు ఈ విగ్రహం రూపొందించారు. గుజరాత్ లోని 182 నియోజక వర్గాలకు అద్దం పట్టేలా ..182 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మించారు. అంటే దాదాపు 600 అడుగుల ఎత్తన్న మాట. ప్రంపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహంగా ఐక్యతా విగ్రహం రికార్డ్ నెలకొల్పింది. అయితే, పటేల్ విగ్రహం కంటే ఎత్తుగా 221 మీటర్ల ఎత్తులో యోగి ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది."స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్" పేరుతో రాముడి విగ్రహాం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారు.
విగ్రహం పునాది 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు, దానిపై ఉండే గొడుగు 20 మీటర్లు ఉండేలా విగ్రహాన్నిడిజైన్ చేశామని, ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం అవుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్యకార్యదర్శి అవనీశ్ అవస్ధి చెప్పారు. విగ్రహం కింద ఇక్ష్వాకు వంశ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటు చేస్తామని అవస్ధి చెప్పారు. సరయూ నది ఒడ్డున నిర్మించే రాముడి కాంస్యవిగ్రహం చుట్టుపక్కల పర్యాటక రంగం అభివృధ్ది చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అవనీశ్ అవస్ధి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో రామమందిర నిర్మాణం చేయాలనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్మసభ నిర్వహించగా....మరో వైపు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ అయోధ్యలో అతి ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.