Begin typing your search above and press return to search.
నత్వానీ కన్నా అయోధ్యరామిరెడ్డే సంపన్నుడు..!
By: Tupaki Desk | 13 March 2020 7:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభకు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో వారంతా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే ఈ పార్టీ నుంచి ఎంపికైన అభ్యర్థులు అపర కోటీశ్వర్లు. వేలు - వందల కోట్లకు పడగలెత్తిన వారే. ముఖ్యంగా పారిశ్రామికవేత్త - కుబేరుడు ముకేశ్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీ కన్నా అయోధ్య రామిరెడ్డి ఆస్తులు అధికంగా ఉండడం ఆశ్చర్యపరిచే విషయం. సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీలకు ప్రాధాన్యచ్చానంటూ చెబుతున్న అధికార పార్టీ ఇచ్చింది మాత్రం సామాన్యులకు కాదు.. కోటీశ్వర్లను ఎంపిక చేసింది.
పార్టీలో తొలి నుంచి తనకు అండగా నిలిచిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరును పార్టీ అధినేత - సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అయోధ్య రామిరెడ్డితో పాటు పరిమల్ నత్వానీ ఇద్దరు పారిశ్రామికవేత్తలు. వీరు తమ రాజ్యసభ స్థానం కోసం నామినేషన్లతో పాటుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. వాటిలో పేర్కొన్న ఆస్తుల వివరాలు చూస్తే అందరూ షాక్ కు గురవ్వాల్సిందే. అంబానీ సిఫార్సు చేసిన పరిమల్ నత్వానీ కంటే అయోధ్య రామిరెడ్డే వేల కోట్ల అధిపతిగా ఉన్నారు. నత్వానీ కంటే సంపదలో అయోధ్య రామిరెడ్డి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఏపీ నుంచి పెద్దల సభకు ఎంపికైన పిల్లి సుభాశ్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ, పరిమల్ నత్వానీలతో పోలిస్తే అయోధ్య రామిరెడ్డి కి భారీ సంపద ఉంది. పరిమళ్ నత్వానీ ధనికుడిగా ఉంటాడని అందరూ భావించగా అఫిడవిట్లు చూస్తే అయోధ్యరామిరెడ్డి సంపాదన ముందు ఆయన దిగదుడుపే. ఆయనకు అత్యధిక ఆస్తులున్నాయి. అఫిడవిట్ లలో పేర్కొన్న ప్రకారం ఆస్తులు ఇలా..
అయోధ్య రామిరెడ్డి ఆస్తులు
ఆయన స్థిర - చరాస్తులన్నీ కలిపి రూ.2,377 కోట్లకు పైగా
చరాస్తి మొత్తం రూ.2,376 కోట్లు - అప్పులు రూ.61 కోట్లు
రూ.55 లక్షల విలువైన వ్యవసాయ భూమి - నివాస గృహాల విలువ రూ.17.55 కోట్లు
భార్య పేరిట చరాస్తి రూ.128.72 కోట్లు - స్థిరాస్తి రూ.13 కోట్లు - వ్యవసాయేతర భూమి విలువ రూ.26 కోట్లు - నివాస గృహాల ఆస్తి రూ.41 కోట్లు - అప్పులు రూ.93 కోట్లు ఉన్నాయి.
కుమార్తె పేరున చరాస్తి రూ.13 కోట్లు
నత్వానీ ఆస్తులు
ఆస్తుల విలువ మొత్తం రూ.400 కోట్లు
చరాస్తి రూ.180 కోట్లు - స్థిరాస్తి రూ.179 కోట్లు
బంగారం - రంగురాళ్ల విలువ రూ.1.35 కోట్లు - ఇతర భూమి రూ.6.50 కోట్లు రూ.1.65 కోట్ల విలువైన భవనాలు ఉన్నట్లు ప్రకటిరచారు.
అప్పు రూ.203 కోట్లు
భార్య పేరిట చరాస్తి రూ.21.25 కోట్లు - స్థిరాస్తి రూ.15 కోట్లు - బంగారం - రంగురాళ్లు కలిపి రూ.5.71 కోట్లు - అప్పు రూ.6 కోట్లు