Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు : ఏఎస్ఐ రిపోర్ట్ ఉహా జనితామా ... కాదా..?

By:  Tupaki Desk   |   9 Nov 2019 11:44 AM GMT
అయోధ్య తీర్పు : ఏఎస్ఐ రిపోర్ట్ ఉహా జనితామా ... కాదా..?
X
శతాబ్దాలు గా కొన సాగుతోన్న అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు శనివారం కీలక మైన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయం తో తీర్పు వెలువరించడం విశేషం. తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవని తెలిపారు.మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందన్నారు.

అయోధ్య కేసు లో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఇచ్చిన నివేదకలు కీలకంగా వ్యవహరించిందని చెప్పాలి. ఏఎస్ఐ ఇచ్చిన నివేదికలను ఊహాజనితమంటూ కొట్టివేయలేం అని చెప్పింది. వివాదాస్పద భూమిలో బాబ్రీ మసీదు నిర్మాణం కంటే ముందు, ఆ అడుగు భూ భాగం లో ఒక నిర్మాణం ఉండేదని ఏఎస్ఐ కోర్టు కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచింది. భూమిలో ఉన్న ఆ నిర్మాణం 12వ శతాబ్ధంన కు చెందినదిని తెలిపింది. అది ఏ మందిరానికి చెందినదనే విషయం మాత్రం స్పష్టం కాలేదని చెప్పింది.

ఏఎస్ఐ ఇచ్చిన నివేదికలోని అంశాలను సుప్రీం కోర్టు తీర్పు సమయంలో పరిగణలోకి తీసుకుంది. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించలేదని, అంతకుముందు అక్కడ ఓ నిర్మాణం కూడా ఉందని వెల్లడించింది. అక్కడ ఉన్న నిర్మాణం పైనే మరో నిర్మాణం జరిగిందని తెలిపింది. ఏఎస్ఐ నివేదికను సందేహించాల్సిన అవసరం లేదని, నివేదికలను అంశాలను కొట్టి పారేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలహాబాద్ హై కోర్టు తరపున 2003లో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూమి పై పురవాస్తు శాస్త్ర వేత్తలు పరిశోధనలు జరిపిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారని, వాటిని సాధారణ అభిప్రాయాలుగా తీసుకోలేమని స్పష్టం చేసింది.