Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు.. బీజేపీ గొప్పదనం కాదు!

By:  Tupaki Desk   |   10 Nov 2019 10:45 AM GMT
అయోధ్య తీర్పు.. బీజేపీ గొప్పదనం కాదు!
X
అయోధ్య తీర్పుపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించిన తీరు ఆసక్తిదాయకంగా ఉంది. అయోధ్య తీర్పు ఎంత మాత్రమూ భారతీయ జనతా పార్టీ ఘనత కాదు అని శివసేనాని ప్రకటించారు. రామమందిర ఉద్యమంలో శివసేన మొదటి నుంచి పాల్గొన్నదని ఆయన గుర్తు చేశారు. అంతే గాక..అయోధ్యలో రామాలయం నిర్మాణానికి చట్టం చేయాలని కూడా తాము డిమాండ్ చేస్తూ వచ్చినవిషయాన్ని ఆయన ప్రస్తావించారు.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా తాము ఆ డిమాండ్ చేశామని ఠాక్రే గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా తాము డిమాండ్ చేస్తున్నా, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చట్టం చేయాలని కోరుతున్నా మోడీ సర్కారు పట్టించుకోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు ఆనందం కలిగించిందని శివసేన అధిపతి తెలిపారు.

ఇలాంటి నేపథ్యంలో కోర్టు తీర్పును బీజేపీ తన క్రెడిట్ గా తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయోధ్య విషయంలో బీజేపీకి ఎలాంటి క్రెడిట్ దక్కదని శివసేనాని అభిప్రాయపడ్డారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తప్ప.. బీజేపీ వాళ్ల వల్ల ప్రయోజనం కలగడం లేదని అభిప్రాయపడ్డారు శివసేన అధిపతి. ప్రస్తుతం బీజేపీ-శివసేన సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానాలు ఆసక్తిదాయకంగా మారాయి.