Begin typing your search above and press return to search.

శనివారమే అయోధ్య తీర్పు.. ఎందుకు.?

By:  Tupaki Desk   |   9 Nov 2019 6:15 AM GMT
శనివారమే అయోధ్య తీర్పు.. ఎందుకు.?
X
దేశం మొత్తం ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న అయోధ్య కేసు ఈరోజే రాబోతోంది. వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం పై సుప్రీం కోర్టు ఈ శనివారం చారిత్రక తీర్పును ఇవ్వబోతోంది. ఇప్పటికే విచారణను పూర్తి చేసిన సుప్రీం కోర్టు ఈ శనివారమే తీర్పును ఇవ్వడం వెనుక పలు కారణాలు ఉన్నాయి.

నవంబర్ 17న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న రంజన్ గొగోయ్ రిటైర్ కాబోతున్నారు. నిజానికి ఈ కేసు పై తుది తీర్పును నవంబర్ 14 లేదా 15,16 తేదీల్లో ఇవ్వడాని కి రెడీ అయ్యారు. కానీ 16న రెండో శనివారం, 17న ఆదివారం అంతకు ముందే తీర్పును ఇవ్వాలి. రంజన్ గొగోయ్ 17న రిటైర్ కాబోతుండడం తో అప్పుడే ఇస్తే ఎవరైనా తీర్పు పై రివ్యూ కోరితే మళ్లీ పున సమీక్షించడం కష్టం. అందుకే సరిగ్గా వారం ముందు ఈ శనివారం 9న తీర్పు ఇస్తారు. రేపు ఆదివారం. ఎల్లుండి నుంచి మళ్లీ సుప్రీం కోర్టు ఉంటుంది. కాబట్టి రివ్యూ అడిగినా సోమ, మంగళవారాల్లో తుది తీర్పును ఇచ్చేవచ్చు. సుప్రీం చీఫ్ జస్టిస్ 17లోపు రిటైర్ మెంట్ వరకు ఉంటారు కాబట్టి దీనిపై రివ్యూలకు సమస్య రాదు..

ఇక మరో కారణం ఈ శనివారమే ఇవ్వడానికి ఈరోజు 'యాంటీ సోషల్ డే' కావడమే.. వీకెండ్, పైగా రెండో శనివారం అందరికీ సెలవు రోజు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బడులు , ఆఫీసులన్నీ బంద్. జనాలు అంతా ఇళ్లల్లో లేదా టూర్లలో ఉంటారు. ఈరోజు తీర్పునిస్తే జనం ఉమ్మడిగా కలిసి ఆందోళన చేసే అవకాశాలు తక్కువ. పైగా రేపు ఆదివారం సెలవు రోజే. దీంతో ఆందోళనలకు అవకాశం ఉండదు.

ఇలా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ మెంట్ ఒక కారణం కాగా.. రెండోది వీకెండ్ శనివారం సెలవు కావడమే సుప్రీం కోర్టు ఈ చారిత్రక తీర్పును ఇవ్వడానికి సరైన సమయంగా భావించింది.