Begin typing your search above and press return to search.

ఆయుష్మాన్ భారత్ ఉద్యోగికి కరోనా ...ఆఫీస్ మూసివేత !

By:  Tupaki Desk   |   21 April 2020 5:30 AM GMT
ఆయుష్మాన్ భారత్ ఉద్యోగికి కరోనా ...ఆఫీస్ మూసివేత !
X
సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యాలయాన్ని అధికారులు మూసేసారు. అందులో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలోని ఆఫీసును సీల్ చేశారు. దీంతో ఆయుష్మాన్ భారత్ సహా అందులో పని చేసే మిగతా ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌ కు వెళ్లారని సమాచారం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ ను శానిటైజ్ చేస్తున్నారు. ఏప్రిల్-24 తర్వాతనే ఆఫీసును తిరిగి తెరిచే అవకాశమున్నట్లు సమాచారం.

సెంట్రలో ఢిల్లీలో, ముఖ్యంగా వీఐపీ జోన్ లో ఉండే ఈ కార్యాలయంలో ఉన్న సిబ్బందికి కరోనానిర్దారణ కావడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. టెస్ట్ లకు సంబంధించిన పలితాలు వచ్చాకే ఈ కార్యాలయంలో ఇంకా ఎంతమందికి వైరస్ సోకింది అన్న విషయం తెలుస్తుంది. కాగా , దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు ప్రైవేటు ల్యాబ్ ల్లోనూ, నిర్దేశిత ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే, దేశంలోని పేదలకు ఉచిత వైద్య సౌకర్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనను 2018 సెప్టెంబర్ లో ప్రారంభించారు. దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారు. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇకపోతే, ఢిల్లీలో ఇప్పటివరకు 2,003కరోనా కేసులు నమోదవగా,45మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18601 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది..అలాగే ఇప్పటివరకు 590 మంది మృతిచెందారు.