Begin typing your search above and press return to search.
చండీ యాగంలో ఏం చేస్తారు..?
By: Tupaki Desk | 23 Dec 2015 4:56 AM GMTఐదు రోజుల పాటు జరగనున్న అయుత చండీయాగం మరికాసేపట్లో జరగనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అయుత చండీయగానికి సంబంధించి అసలేం జరుగుతుందంటే.. ఎవరూ స్పష్టంగా చెప్పేది లేదు. ఇంతకీ ఈ చండీయాగం జరిగే రోజుల్లో ఏం చేస్తారు? అదెంత భారీగా అన్న విషయంపై చాలామందికి స్పష్టత లేదు. ఎంతమంది భోజనాలు చేయనున్నారు? ఎంతమంది ప్రముఖులు వస్తున్నారు?ఎంత భారీగా ఏర్పాట్లు చేశారన్న విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ.. చండీ అంటే ఏమిటి? ఆ యాగం సందర్భంగా రుత్వికులు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రధానార్చకులు పురాణం మహేశ్వర శర్మ యాగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చెప్పుకొచ్చారు. అవేమంటే..
=చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18 పురాణాలు రాసి.. ఒక్కొక్క పురాణంలో ఆయా దేవతల గొప్పతనాన్ని వివరిస్తూ అవసరం వచ్చినప్పుడు వారిని కీర్తించారు. మార్కండేయ పురాణంలోనిదీ చండీ స్తోత్రం.
= ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. మిగిలిన స్తోత్రాల కంటే ఇది చాలా విశేషమైంది.
= మిగిలిన స్తోత్రాల్ని పఠించి.. అనుష్టానం చేస్తే ఫలితం వస్తుంది. కానీ.. చండీ స్తోత్రాన్ని వింటేనే ఫలితం వస్తుందన్నది నమ్మకం.
= చండీ విధానంలో నవచండీ.. శత చండీ.. సహస్ర చండీ.. లక్ష చండీ.. కోటి చండీలు ఉన్నాయి.
= మన దేశంలో లక్ష చండీలు చేశారు.
= శృంగేరీ బయట చేస్తున్న అయుత చండీ ఇదే మొదటిది కావొచ్చు.
= నవాక్షరీ మంత్రం ఉపదేశం తీసుకున్న వారు మాత్రమే చండీ పారాయణం చేస్తారు.
= దీన్ని ప్రతి రుత్వికుడు తొలి రోజు 4వేలు.. రెండో రోజు 3 వేలు.. మూడో రోజు 2వేలు.. నాలుగురోజు వెయ్యి చొప్పున మూలమంత్రం చేస్తారు.
= అంటే.. యాగం పూర్తయ్యే నాటికి మొత్తం కోటి జపం పూర్తి అవుతుంది.
= ప్రతి రుత్వికుడు చండీపారాయణాన్ని తొలిరోజు ఒకసారి ప్రారంభించి.. నాలుగు రోజులు గడిచేసరికి పదిసార్లు పూర్తి చేస్తారు.
అయుత చండీ యాగం హైలెట్స్ చూస్తే..
= అయుతం అంటే సంస్కృతంలో పదివేలు. 10వేల చండీ సప్తశతీ పారాయణాలు పూర్తి చేసి అందులో పదోవంతు హోమం చేసి పూర్ణాహుతులు సమర్పించటమే అయుత చండీయాగంగా చెప్పొచ్చు.
= ఈ మహా క్రతువును ఏకోత్తర వృద్ధి విధానంలో శృంగేరీ పీఠ సంప్రదాయంలో నిర్వహిస్తారు.
= ఈ మహా క్రతువులో 1100 మంది రుత్వికులు.. ఏక కంఠంతో సప్తశతీపారాయణం చేస్తారు.
= ఐదు రాష్ట్రాల నుంచి 1500 మంది రుత్వికులు పాల్గొంటున్నారు.
= మొత్తం 40 ఎకరాల్లో సాగుతున్న ఈ కార్యక్రమంలో మొత్తంగా 3 ఎకరాలు కేవలం యాగశాల కోసం కేటాయించారు.
= 108 హోమ గుండాలు సంప్రదాయ సిద్ధంగా తయారు చేశారు.
= 2011 ఏప్రిల్ లో కర్ణాటకలోని శృంగేరీలో అయుత చండీయాగం నిర్వహించారు. ఆ తర్వాత ఏకోత్తర వృద్ధి విధానంలో ఎర్రవల్లిలో జరుగుతోంది.
= ఈ యాగం కోసం 30 టన్నుల (టన్ను అంటే వెయ్యి కిలోలు) మోదుగ సమిధలు.. 12 టన్నుల పాయసం.. 4వేల కిలోల ఆవునెయ్యి.. రోజూ వెయ్యి కమలాలతో హోమం.
= రోజువారీగా ప్రసాదాల కోసం ఇప్పటికి 3 లక్షల లడ్డూలు తయారు చేశారు.
= రోజూ 50 వేల మందికి భోజనాలు వడ్డించనున్నారు.