Begin typing your search above and press return to search.
ఆట ఆడుకున్న.. మాజీ మంత్రి!
By: Tupaki Desk | 19 Feb 2022 3:45 PM GMTఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకుడు, విశాఖపట్నానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. తాజాగా సటైర్లు పేల్చారు. సీఎం జగన్ పాలనపైనా..ఆయన భాషపైనా.. మాజీ మంత్రి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గతంలో తాను చేసిన.. ఓ కామెంట్‌పై పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ.. తాను గతంలో అన్న మాటకు కట్టుబడ్డానని.. ప్రజల అశేష ఆశీర్వాదంతో ఎన్నికైన.. సీఎం జగన్.. ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
ఒక ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉన్న జగన్.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని.. ముఖ్యంగా ఇరిగేషన్.. ఇండస్ట్రీలు, విద్య, వైద్యం ఇలా.. ప్రజల కోసం పనిచేయాల్సిన ఆయన చేపలు అమ్ముకుంటాను.. మాంసం అమ్ముకుంటాను... మద్యం అమ్ముకుంటాను... మద్యం దుకాణాల వద్ద.. చీకులమ్ముకుంటానం టూ.. పాలన చేస్తున్నాడని.. దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఇవేనా? అని నిలదీశారు. ఆయనకు పరిపాలన తెలియడం లేదని.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
అంతేకాదు..తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న కార్యక్రమంలో టూరిజం అభివృద్ధితో రాష్ట్రం వన్నె చేకూరిందని అనడం కూడా రాలేదని.. `వెన్న` తెచ్చిందంటూ.. వ్యాఖ్యానించాడని.. ఇలాంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని.. ఆయన పైగా అమెరికాలో చదివానని చెబుతాడని.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు మనం సంబర పడాలో.. సిగ్గుపడాలో.. నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావడం లేదని అన్నారు.
సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించిన అయ్యన్న..ఆయనకు మల్లెపూలు అమ్ముకోవడమే సరైందని పేర్కొన్నారు. అంబటికి సరైంది.. మల్లెపూలు అమ్ముకోవడమే సరైన వ్యాపారమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
``మ జిల్లా(విశాఖ) మంత్రి ఉన్నాడు.. అవంతిశ్రీనివాసరావు.. ఆయనకు అరగంట కావాలట. ఇక, అంబటికి గంట సరిపోతుందంట! ఈ భాషేంటో నాకు అర్ధం కావడం లేదు. అంబటి రాంబాబు కనిపిస్తే అడగాలని అనుకుంటున్నాను... గంట అంటున్నావు..ఏంటి? గంటేంటి? అని అడగుదామని అననుకుంటున్నా`` అని అయ్యన్న వ్యాఖ్యానించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.
ఇటువంటి `పెద్దలు` ఆ పార్టీలో ఉన్నారని, మన రాష్ట్రం బాగుపడాలన్నా.. పిల్లలు అభివృద్ధి చెందాల న్నా.. చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని.. మాజీ మంత్రి పేర్కొన్నారు. మొత్తానికి అయ్యన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.