Begin typing your search above and press return to search.
టీడీపీలో కలకలం.. బాబు ఫోన్ కు స్పందించని మంత్రి!
By: Tupaki Desk | 10 March 2019 10:13 AM GMTఎన్నికల ముందు బోలెడన్ని అసంతృప్తులు, అసమ్మతి కార్యకలాపాలతో అట్టుడుకుతున్న తెలుగుదేశం పార్టీలో మరిన్ని ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బయటి వాళ్లకు ఆసక్తిదాయకంగా కనిపిస్తున్న ఈ పరిణామాలు టీడీపీలో మాత్రం కలవరాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా మరో మంత్రి చంద్రబాబు తీరు మీద అలిగారు అనే ప్రచారం సాగుతూ ఉండటం విశేషం.
ఇది వరకూ పలు నిర్ణయాల విషయంలో బాబుతో విబేధించి వార్తల్లోకి వచ్చిన అయ్యన్న పాత్రుడు మరోసారి బాబు తీరు మీదు గుర్రుగా ఉన్నారట. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి ఎంపీ టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. చాలా చోట్ల ఈ రోజు చేరిన నేతలకు కూడా టికెట్లు కేటాయించే పరిస్థితి ఉంది అనే స్పష్టం అవుతూ ఉంది. అభ్యర్థుల విషయంలో అధికార పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అందుకే బాబు కూడా బహిరంగంగా ప్రకటించేశారు.
ఈ ప్రకటన మంత్రి అయ్యన్నను అసంతృప్తికి గురి చేస్తూ ఉందట. టీడీపీలోకి కొత్తగా వచ్చే వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల విషంలో ప్రాధాన్యతను ఇవ్వడం ఏమిటని.. ఆయన మండి పడుతున్నారని సమాచారం. పార్టీలో పని చేసిన వారికే టికెట్లు కేటాయించాలి తప్ప.. బయటి వాళ్లకు కాదనేది అయ్యన్న అభిప్రాయం. ఈ అసంతృప్తితో బాబు సమావేశం నుంచి కూడా అయ్యన్న బయటకు వచ్చారట.
ఈ పరిస్థితిని తెలుసుకుని బాబు కూడా మంత్రితో మాట్లాడటానికి ఫోన్ చేసినట్టుగా సమాచారం. అయితే ఆయన మాత్రం బాబు ఫోన్ కు స్పందించలేదని, లిఫ్ట్ కూడా చేయలేదని తెలుస్తోంది. ఇది వరకూ కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు విషయంలో కూడా అయ్యన్న మొదట చంద్రబాబు తీరుతో విబేధించారు. ఆ తర్వాత కామ్ అయిపోయారనుకోండి!