Begin typing your search above and press return to search.
పవన్..నీ చేతకానితనం బయటపడింది
By: Tupaki Desk | 11 Sep 2016 4:37 AM GMTసినీ నటుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పల్లెత్తు మాట అనరాదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని నేతలను - మంత్రులను ఆదేశించినప్పటికీ ఆచరణలో అది ఫెయిల్ అవుతోంది. రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం కట్టలు తెంచుకొని పవన్‌పై మండిపడ్డారు. ‘అనకాపల్లిలో నీ బావ అల్లు అరవింద్ పోటీ చేస్తే నువ్వు - మీ అన్న ఎందుకు గెలిపించుకోలేకపోయారు..?’ అంటూ అయ్యన్న పాత్రుడు జనసేనానిపై మండిపడ్డారు.
తనను కలిసిన విలేకరులు ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఎంపీ అవంతి శ్రీనివాస్ తన సభ్యత్వానికి రాజీనామా చేస్తే జనసేన నుంచి టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తానంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పెద్ద హీరోలు అయి ఉండి సొంత బావ అల్లు అరవింద్ ను గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్ ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాలని, అర్థం లేకుండా మాట్లాడరాదని ఆయన సూచించారు. పవన్ వ్యాఖ్యలను గౌరవిస్తామని అయిఏ తమను కించపర్చేలా ఉంటే సహించేది లేదని అయ్యన్నపాత్రుడు పునరుద్ఘాటించారు.